భారత్ పై మునుపెన్నడూ లేని విధంగా అమెరికా విరుచుకుపడింది...అంతేకాదు హెచ్చరికలు కూడా జారీ చేసింది దీంతో భారత ప్రభుత్వం ఆలోచనలో పడిందని అంటున్నారు విశ్లేషకులు..ఇంతకీ ఏమి జరిగింది అమెరికా ఎందుకు భారత్ కి వార్నింగ్ ఇచ్చింది అంటే..రష్యా నుంచీ ఎస్-400 ట్రయంఫ్ వంటి కీలక రక్షణ వ్యవస్థలను కొనడాకి భారత్ ప్రయత్నిస్తోంది...అయితే ఈ కొనుగోలుపై అమెరికా హెచ్చరించింది.. ఈ వ్యవస్థలను కొంటే భారత్‌పై కఠినమైన ఆంక్షలను విధిస్తామని నిర్మొహమాటంగా చెప్పేసింది.

 Image result for america warning to india for s-400

 అమెరికా అడ్మినిస్ట్రేషన్‌ అధికారి ఒకరు శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఆంక్షల లక్ష్యం భరత్ కాదని రష్యా అని తెలిపారు..రష్యా పాల్పడుతున్న దురుద్దేశపూర్వక చర్యలకు ప్రతిస్పందనగా ఆ దేశాన్ని నియంత్రించే అంశంపై దృష్టి సారించినట్లు తెలిపారు...ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ వంటి కీలక రక్షణ వ్యవస్థలను కొనడాన్ని ప్రాధాన్యంగల లావాదేవీగా పరిగణిస్తామని ఆ అధికారి తెలిపారు..అమెరికాకు ప్రతికూలంగా వ్యవహరించే దేశాలపై ఆంక్షలను విధించేందుకు ఆ దేశంలో ప్రత్యేక చట్టం అమలవుతోంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించే దేశాలు, వ్యక్తులు, సంస్థలపై  ఎంతో కఠినమైన ఆంక్షలను విధించే విధంగా ట్రంప్ ఒక ఆర్డర్ పై సంతకం కూడా చేశారు..

Image result for trump

 ప్రస్తుతం భారతదేశం దాదాపు 4.5 బిలియన్ డాలర్ల వ్యయంతో 5 గగనతల రక్షణ వ్యవస్థలను (ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను) రష్యా నుంచి కొనాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టం ప్రకారం భారతదేశంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు అమెరికా సంకేతాలిస్తోంది...అయితే భారత్ కి అమెరికాకి ఉన్న సంభందాల దృష్య్టా ఇది హెచ్చరికతోనే ఆగిపోతుందని ముందుకు వెళ్ళే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: