అమెరికా చరిత్రలోనే అత్యంత విలువైన భారీ లాటరీపై ఇప్పుడు అందరి దృష్టి పడింది..ఈ లాటరీని సొంతం చేసుకునే అదృష్టవంతుడు ఎవడో ఎక్కడ ఉన్నాడో అంటూ అందరూ కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు.ఇక లాటరీ టిక్కెట్టు కొన్న వాళ్ళకైతే గుండె మోకాలు లోకి జారిపోతోంది లాటరీ వారు చేస్తున్న కౌంట్ డౌన్ లకి. ఇంతపెద్ద మొత్తం గెలుచుకోవడం అంటే మాటాలు కాదు. మరి ఈ లాటరీ వివరాలు విషయాలు ఒక్క సారి చూద్దామా..

 Image result for mega millions jackpot america

మెగా మిలియన్ జాక్‌పాట్‌ పేరుతో అమెరికాలో నిర్వహించే లాటరీలు ప్రభుత్వ అనుమతులతో ఎంతో కట్టుదిట్టంగా జరుగుతాయి. ఈ డ్రాలో గెలుపొందిన వారికి ఆయ ఆసంస్థ కళ్ళు చెదిరే బహుమతిని గిఫ్ట్ గా ఇవ్వనుంది. ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలుసా..160 కోట్ల డాలర్లు..అంటే దాదాపు  రూ.11756 కోట్ల ఇండియన్ కరెన్సీ అన్నమాట.. ఏంటి ముందే తెలిస్తే బాగుండు కొనుక్కునే వాళ్ళం అనుకుంటున్నారా..సరే ఇక అసలు విషయం ఏంటంటే..

 Image result for mega millions jackpot america

అయితే  శుక్రవారమే  డ్రా నిర్వహించినా ఎవరూ.ఆ డ్రాలో 15, 23, 53, 65, 70, మెగా బాల్ 7 నంబర్లను అందుకోలేకపోయారు. మంగళవారం నిర్వహించే డ్రాలో ఈ ఆరు నంబర్లను సాధించగలిగితే ఈ జాక్‌పాట్‌ను సొంతం చేసుకోవచ్చు..ఇక్కడ కండిషన్స్ కూడా పెట్టారు డ్రాలో గెలుపొందిన వారికి అప్పటికప్పుడు డబ్బులు కావాలి అంటే 90.4 కోట్ల డాలర్లు అంటే రూ.6600 కోట్లు అప్పగిస్తారు లేదు మొత్తం కావాలి అంటే విడతల వారీగా 29 ఏళ్లలో ఇచ్చేస్తారు..ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరో ఎక్కడ ఉన్నాడో..

 


మరింత సమాచారం తెలుసుకోండి: