హెచ్ 1-బీ వీసా జారీ విషయంలో ట్రంప్ ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గే అవకాశం కలిపించడం లేదని అంటున్నారు నిపుణులు తాజాగా ఈ వీసా జారీలో ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆదేశాలు ఇక భారతీయులకి గడ్డు కాలమే అనేట్టుగా ఉన్నాయని అంటున్నారు..అమెరికా వచ్చి లక్షలు సంపాదించి స్థిరపడాలని అనుకునే వారి కలలు కల్లలు అయినట్టే అంటున్నారు..ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

 Image result for h1b visa

అమెరికాలో ఉండే ప్రతీ  కంపెనీ ఇక నుంచి ఎంతమంది విదేశీయులకు హెచ్‌-1బీ వీసా కింద ఉపాధి కల్పిస్తున్నారో తప్పనిసరిగా వెల్లడించాలని ,కంపెనీలు విదేశీ ఉద్యోగులను స్పాన్సర్‌ చేసే నిబంధనలను మరింత కఠినతరం చేయాలనే ఉద్దేశంతో ట్రంప్‌ సర్కార్‌ ఈ కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది..అయితే అమెరికా కంపెనీలు ఎప్పటినుంచో విదేశీయులకు ఉద్యోగాలను ఇచ్చేందుకు ఈ వీసా రూపంలో నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాను జారీ చేస్తూ వస్తున్నాయి.

 Image result for h1b visa

అయితే ఈ వీసాల మంజూరులో భారీ అవతవకలు జరుగుతున్నాయని గుర్తించిన ట్రంప్ సర్కార్.. కొన్ని నిబంధనలు రూపొందిస్తోంది..ఈ నిభంధనల ప్రకారం హెచ్‌-1బీ వీసా కోసం విదేశీ వర్కర్‌కు స్పాన్సర్‌ చేసే ముందు కార్మిక శాఖ ద్వారా అవసరమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా లేబర్‌ దరఖాస్తును కంపెనీ కచ్చితంగా ఆమోదించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఉద్యోగానికి అమెరికా ఉద్యోగి లేడని వెల్లడించటంతో పాటు హెచ్‌-1బీ కింద స్పాన్సర్‌ చేయబోయే విధేశీ ఉద్యోగికి సంబంధించిన వివరాలను కార్మిక శాఖ సర్టిఫై చేయాల్సి ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: