భారత సాంప్రదాయానికి తగ్గట్టుగా దీపావళి రోజున సింగపూర్ లో భారత ఎన్నారైలు టపాసులు పేల్చారు అయితే తమ ఇంట్లోనే టపాసులు పేల్చుకోవడంతో పాటు రూల్స్ కి విరుద్దంగా టపాసులు పెల్చినందుకు గాను పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు..అక్కడ యిషున్, బుకిట్ బటోక్ వెస్ట్ జూ సెంగ్ రోడ్‌లలో టపాసులు కాల్చిన హరిప్రశాంత్, ఇల్విస్ జావీర్ ఫెర్నాండేజ్, జీవన్ అర్జోన్, అలగప్పన్ సింగారం అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు..

 Image result for singapore indian nris arrested diwali crackers

ఇదిలాఉంటే వారు పేల్చింది అతి ప్రమాదకరమైన టపాసులని అయితే టపాసులు ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయో తెలియరాలేదని రికార్డుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా టపాసులు పేల్చడానికి సహకరించిన మరో ఇద్దరు ఎన్నారైలపై కూడా బుధవారం కేసులు నమోదయ్యాయి..వీరికి 5 వేల సింగపూర్ డాలర్ల వ్యక్తిగత పూచిత్తుపై అందరూ బెయిల్ తీసుకున్నారు.

 Image result for singapore indian nris arrested diwali crackers

అయితే ప్రమాదకరమైన టపాసులను పేల్చడం, కొనడం, రవాణా, తయారీని నేరంగా పరిగణిస్తామని, భారీ జరిమానాతోపాటు రెండు ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఇదిలావుండగా టపాసులు కాల్చడంపై 1968లో సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం ప్రారంభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: