అమెరికాలో తెలుగుజాతికి ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. మరో తెలుగు యువకుడిని ఆదుకోవాలని పిలుపునిచ్చింది. విజయవాడకు చెందిన రూపక్ టెంపాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. టెంపాలో ఆరువారాల క్రితం జరిగిన ప్రమాదంలో రూపాక్ తీవ్రంగా గాయపడి అపాస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతనికి వెంటిలేటర్ మీద డాక్టర్లు చికిత్స కొనసాగించారు. అయితే మెదడు కూడా దెబ్బ తినడంతో అతను అపాస్మారక స్థితి నుంచి బయటపడలేకపోతున్నాడు. డాక్టర్లు మూడు వారాలపాటు ఐసీయూలో చికిత్స చేసి.. ప్రస్తుతం పీసీయూకి తరలించారు. ఇప్పటికి కూడా అతను సాథారణ స్థితికి రాలేదు. తలకు తగిలిన బలమైన గాయం వల్ల మొదడులో రక్త స్రావం జరిగి అతను కోలుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చని డాక్టర్స్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో అతనికి అండగా నిలిచేందుకు నాట్స్ ముందుకు వచ్చి గత ఆరు వారాల నుండి హెల్ప్ లైన్ టీం మరియు నాట్స్ టంపా చాప్టర్ టీం  ద్వారా తనకు కావాల్సిన సహాయాన్ని అందిస్తున్నది. 


విజయవాడకు చెందిన రూపక్ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి.. 2014లో అమెరికాకు చదువుకునేందుకు వచ్చారు. ఆ తర్వాత రెండేళ్లలో చదువు పూర్తి చేసుకుని ప్రస్తుతం సాప్ట్ వేర్ ఇంజనీరింగ్ లో ట్రైనింగ్ చేస్తున్నాడు. ఎంతో కష్టపడే తత్వం ఉన్న రూపక్.. తన ట్రైనీ పీరియడ్ లో కూడా రాత్రింబవళ్లు శ్రమించేవాడు.. ప్రస్తుతం రూపక్ కు జరిగిన ప్రమాదాన్ని తెలుసుకుని అతడి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. తండ్రి కూడా కోల్పోవడంతో రూపక్ కుటుంబ భారాన్నంతా భుజాలపై వేసుకుని అమెరికాలో ఉద్యోగంతో కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. కానీ రోడ్డు ప్రమాదం ఇప్పుడు రూపక్ కుటుంబానికి శాపంలా మారింది. రూపక్ ను  చూసేందుకు అతని సోదరుడు, తల్లి అమెరికా బయలుదేరారు.

సామాన్య మధ్య తరగతి కుటుంబం కావడంతో అమెరికాకు వచ్చేందుకు కూడా ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ఈ సమయంలోనే నాట్స్ వారికి అండగా నిలబడింది. ఇప్పుడు రూపక్ సాధారణ స్థితికి చేరుకోవాలంటే తల్లి దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి.. తలకు తగిలిన గాయంతో ఇప్పుడు వైద్యానికి భారీగా ఖర్చవుతుంది. ఈ ఖర్చును భరించే స్తోమత కూడా రూపక్ కుటుంబానికి లేదు. ఈ సమయంలో నాట్స్ రూపక్ కు అండగా నిలబడేందుకు నాట్స్ హెల్ఫ్ లైన్ ద్వారా పిలుపునిస్తోంది. ఎవరు తోచిన విరాళం వారిస్తే ఎంతో కొంత ఆ కుటుంబానికి అండగా నిలవచ్చని మరియు వైద్య సహాయానికి సహకారం అందించవలసిందిగా కోరుతోంది. రూపక్  కోసం 200,000 డాలర్ల విరాళాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా నాట్స్ అమెరికాలో ఉండే తెలుగువారందరిని కోరుతోంది. నాట్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి రూపక్ కు విరాళాలు ఇవ్వొచ్చని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: