అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మామూలు షాకు తగిలినట్టుగాలేదు. దిమ్మతిరిగి బొమ్మ కనిపించేసింది. మొన్నటి వరకూ అంటే డెమొక్రాట్ల ఆధిపత్యం లేని సమయంలో ట్రంప్ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అయితే ఎప్పుడైతే డెమోక్రాట్లు తాజాగా నెల క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారో అప్పటి నుంచీ ట్రంప్ కి నుంచుంటే గుద్దు కూర్చుంటే గుద్దులా మారింది పరిస్థితి. ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా సరే సభలో డెమొక్రాట్ల మద్దతు ఉండాల్సిందే

 Related image

ఈ క్రమంలోనే షట్ డౌన్ విషయంలో డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రతినిధుల సభలో షట్ డౌన్ ఎత్తేసేందుకు వీలుగా బిల్లును ఆమోదించింది. మెక్సికోతో సరిహద్దులో గోడ విషయం పక్కన పెట్టి ట్రంప్ కి షాక్ ఇస్తూ ఎలాంటి నిధులు ఇవ్వకుండానే బిల్లుని ఆమోదింప చేసింది. గత నవంబరులో జరిగిన మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రిపబ్లికన్లు వ్యతిరేకించినప్పటికీ డెమోక్రాట్ల మెజార్టీ ఉడడంతో బిల్లులు ఆమోదించారు.

 Image result for democrats pass bill trump

ఇదిలాఉంటే ఒకవేళ యూఎస్‌ కాంగ్రెస్‌ గోడకు నిధులు ఇవ్వకుండా బిల్లుని ఆమోదింప చేస్తే దానిని ట్రంప్ వీటో అధికారంతో రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు గోడ నిర్మాణానికి నిధులు కేటాయించే వరకు ద్రవ్య వినమయ బిల్లుపై సంతకం పెట్టనని ట్రంప్‌ ఫిట్టింగ్ పెట్టిన విషయం తెలిసిందే అయినా నిధులు విషయంలో డెమోక్రాట్లు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోకుండా  పట్టు బడుతున్నట్లుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: