అమెరికాలో ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు ,వారు తీవ్రమైన నేరాలకి పాల్పడినప్పుడు వారిని పరిశీలిస్తూ ఉండటానికి , వారి కాళ్ళకి “రేడియో ట్రాక్టర్స్” ఫిట్ చేస్తారు. ఈ క్రమంలోనే వారి కదలికలు ఎప్పటికపుడు గుర్తిస్తూ ఉంటారు. అయితే తాజాగా పే అండ్ స్టే వీసా కుంభకోణంలో నిర్భంధం లోకి తీసుకున్న వందమంది  పైగా భారతీయ విద్యార్ధుల పట్ల అమెరికా ప్రభుత్వం ఎంతో దారుంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది.

Related image

నేరస్తుల కాళ్ళకి రేడియో ట్రాక్టర్స్  కట్టినట్టుగా ఇప్పుడు విద్యార్ధుల కాళ్ళకి సైతం రేడియో ట్రాక్టర్స్ ఫిట్ చేస్తున్నారట. ఈ విషయం ఎంతో దారునమైనదని అంటున్నారు. వీటిని విద్యార్ధులకి కట్టడం ద్వారా వారి కదలికల్ని గమనిస్తూ ఉండవచ్చునని , వారిఈ పరిమిత ప్రాంతంలోనే తిరుగుతూ ఉండాలని ఉంటుంది.అంతేకాదు వారూ ఎప్పటికప్పుడు వాటికి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలని తెలిపారు.

 Image result for indian students in us jail

అధికారులు ఎప్పుడు విద్యార్ధులని కాంటాక్ట్ చేసినా సరే వెనువెంటనే బదులు ఇవ్వాలని తెలిపిందట. ఈ రకమైన ఆంక్షలు కేవలం నేరస్తులపై మాత్రమే పెడుతారని, అలాంటిది విద్యార్ధుల కాళ్ళకి ట్రాక్టర్లు కట్టడం అమానుషమని అంటునారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై  అధికారికంగా దృవీకరించలేదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: