విదేశాలలో ఉంటున్న ఎన్నారైలు, స్వదేశంలో వివాహాలు చేసుకుని  ముచ్చట తీరాకా, తమ భార్యలని తమతో తీసుకుని వెళ్తామని చెప్పి చక్కగా చెక్కేసి,ఉలుకు పలుకు లేకుండా అందిన కాడికి దోచుకుని, ఎంజాయ్ చేసే రోజులు పోయాయి. కేంద్రం తీసిన కొత్త బిల్లు కొరడాతో 45 మంది ఎన్నారైలని ఉతికి ఆరేసింది. భార్యలని విదేశాలు తీసుకుని వెళ్లి అక్కడ చిత్ర హింసలు పెడుతూ, స్వదేశంలో ఉన్న భార్యలని అదనపు కట్నం కోసం వేదిస్తున్న 45 మంది పాస్పోర్ట్ లని రద్దు చేసింది కేంద్రం.

 Image result for nri dowry harassment

ఈ విషయాన్ని స్వయంగా మేరకు స్త్రీ , శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రకటించారు. అలంటి భర్తలపై  లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే విషయంపై నోడల్ ఏజెన్సీ దుష్టి సారించిందని తెలిపారు. ఈ నోడల్ ఏజెన్సీ కి మహిళా శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేష్‌ శ్రీవాస్తవ నేతృత్వం వహిస్తున్నట్టుగా మేనకా గాంధీ తెలిపారు.

 Related image

భార్యలని వదిలేసి వెళ్ళిపోతున్న భర్తలకి ఇదొక గుణపాటం అని ముందు ముందు ఏ ఎన్నారై అయినా సరే ఇటువంటి తప్పు చేయాలంటే విదేశంలో ఉద్యోగం చేసుకునే ఆలోచన మానుకోవాల్సిందేనని, అరెస్టులు ఆస్తుల అటాచ్మెంట్ తప్పదని ఆ కీలక బిల్లుని కేంద్రం ఆమోదించిందని ఆమె తెలిపారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: