అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనల మేరకు కేవలం నైపుణ్యం ఉన్నవిదేశీయులకి మాత్రమే హెచ్ -1 బీ వీసా ఇస్తున్నామని ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.  ఏప్రిల్ 1 వ తేదీ నుంచీ విదేశీయుల నుంచీ   హెచ్ -1 బీ ధరఖాస్తులు తీసుకుంటున్నామని ప్రకటించారు.

 Related image

అయితే ఈ వీసాలకి అర్హతలు సాధించిన వారు తాము ఎంచుకున్న ఉద్యోగాలలో అక్టోబర్ నుంచీ చేరిపోయే అవకాశం ఉందని తెలిపారు. యూఎస్‌సీఐఎస్‌ నిబంధనల ప్రకారం గతేడాది వరకు ఏటా 65 వేల హెచ్‌1బీ దరఖాస్తులను జారీచేశారు.  అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించే విదేశీయుల కోసం మరో 20 వేల దరఖాస్తులను తాజాగా ఆహ్వానించనున్నారు.

 Image result for h1 b visa

దాంతో ప్రతీ ఏడాది  అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీలు పూర్తి చేసిన 5,340 మంది విదేశీయులు అదనంగా లబ్ది పొందే అవకాశముంది. విదేశీయులలో ముఖ్యంగా భారతీయులు ఈ వీసాలని ఉపయోగించుకుంటున్నారని తేలింది. కేవలం అమెరికాలో అమెరికాలో మాస్టర్‌ డిగ్రీలు పూర్తి చేసినవారికి మాత్రమే ఈ అవకాశముంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: