ఎంతో మంది భారతీయుడు విదేశాలలో ఉన్నత శిఖరాలని చేరుకుంటూ భారత పరువుని నిలబెడుతుంటే. కొంతమంది మాత్రం భారత పరువు పరాయి దేశంలో పోగొడుతున్నారు. ఇలాంటి ఘటనే బ్రిటన్ లో చోటుచేసుకుంది. ఆరుగురు మహిళలని నమ్మించి మోసం చేసిన ఇండియన్ ఎన్నారైకి అక్కడి కోర్టు శిక్షని విధించింది. ఇక్కడ ఓ విశేషం ఏమిటంటే అతడి నేరాలకి ఆధారాలు సేకరించడానికి స్థానిక పోలీసులకి ఐదేళ్ళ సమయం పట్ట్టింది. వివరాలలోకి వెళ్తే...

 Image result for keyur vyas

 బ్రిటన్‌లో నివాసం ఉంటున్న కేయుర్ వ్యాస్  అనే వ్యక్తి ఆన్లైన్ లో ఉండే స్నేహం చేస్తాడు. తనని తానూ ఆర్ధిక రంగ నిపుణుడిగా పరిచయం చేసుకుని వారితో కలిసి విందులు ,వినోదాలు చేస్తాడు. వారిని శారీరకంగా కూడా లోబరుచుకుని కొన్నాళ్ళకి తనకి తెలిసిన కంపెనీ ఉందని అందులో పెట్టుబడులు పెడితే కోట్లు వస్తాయని నమ్మచెప్తాడు. డబ్బులు చేతికి రాగానే నకిలీ కంపెనీల పత్రాలని వారికి ఇచ్చి చేతులు దులుపుకుంటాడు

 Image result for britain king stone court

డబ్బుల విషయం వచ్చే సరికి బెదిరింపులకి దిగుతూ ఒక్క పైసా కూడా ఇవ్వనని చెప్తాడని బాదితులు పోలీసులకి వివరించారు ఆ ఆరుగురు మహిళలు. పోలీసుల దర్యాప్తులో మొత్తం అతడు రూ.5.80 కోట్లు ఆ ఆరుగురు మహిళల నుంచీ తీసుకున్నాడని తేలింది. ఈ ఘటన విన్న కింగ్‌స్టన్ కోర్టు అతడికి ఆరేండ్ల జైలుశిక్ష విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: