అమెరికాలో నైపుణ్యం గల ఉద్యోగాలు చేసేవారికి తాము ఇచ్చిన హెచ్ -1బీ వీసా దరఖాస్తు రుసుము పెంచాలని అమెరికా యోచిస్తోంది. అందుకు గాను ట్రంప్ నుంచీ కీలక ఆదేశాలు కూడా జారీ అయినట్టుగా తెలుస్తోంది. తమ దేశంలో అప్రెంటిస్‌ ని విస్తరించేందుకు రుసుము పెంచాలని భావిస్తున్నట్టుగా అమెరికా కార్మిక శాఖ మంత్రి  అలెగ్జాండర్‌ అకోస్టా తెలిపారు.

 Image result for us-plans-increase-h1b-visa-application-fee

ఇదే గనుకా జరిగితే భారతీయ ఐటీ కంపెనీలపై ఆర్ధిక భారం పడే అవకాశం ఉందని నిన్నటి రోజున జరిగిన అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్రెంటిస్‌ కార్యక్రమాన్ని దుర్వినియోగ పరిచే వారినుంచీ అమెరికా కార్మికుల ప్రయోగానాలని కాపాడేందుకు,ఇప్పటికే హెచ్‌–1బీ వీసా దరఖాస్తులో మారుపులు చేస్తున్నామని ఇలా చేయడం వలన ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని ఆయన తెలిపారు.

 Image result for us-plans-increase-h1b-visa-application-fee

ఇదిలాఉంటే ఈ దరఖాస్తు రుసుము ఎంత పెంచుతారు, ఏఏ కేటగిరీలలో  ఎంత పెంచుతారనేది ఇంకా తెలియరాలేదు. 2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కార్మిక శాఖకి 160 మిలియన్‌ డాలర్లు కేటాయిస్తాం. అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రాంను విస్తరిస్తాం. అందుకు గాను హెచ్ -1 బీ పై అధిక రుసుము తీసుకుని రెవెన్యూ రాబడుతామని ఆయన అన్నారు. అయితే అమెరికాలో హెచ్‌–1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులు దాదాపు 6.5 లక్షల మంది ఉంటున్నారని తెలుస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: