కొలంబియా కోర్టు భారత ఎన్నారై డాక్టర్ కి దిమ్మతిరిగిపోయే తీర్పు ఇచ్చింది. దాంతో మహిళా జడ్జి  ఇచ్చిన తీర్పుకి సదరు ఎన్నారై జడ్జిపైనే చెలరేగి పోయాడు. ఈ ఘనట కొలంబియాలో జరిగింది. గోభినాధాన్ అనే ఓ 69 ఏళ్ల  డాక్టర్ 1997లో ఇండొనేషియాలో పనిచేశావాడు.అయితే అప్పటికే అతడికి వివాహం అయ్యింది. తన సహా ఉద్యోగిని అయిన ఓ నర్సు తో అతడు అక్రమ సంభంధం పెట్టుకుని, ఆ తరువాత తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చేసి నర్సుని రెండో పెళ్లి చేసుకున్నాడు.

 Related image

ఈ జంట కొంత కాలం కలిసి ఉంది, వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంత కాలం తరువాత వృత్తి కారణంగా మళ్ళీ ఇండోనేషియా వెళ్లాల్సి వచ్చింది. భార్య, పిల్లలను కెనడాలో ఉంచి వచ్చిన అతడికి రెండో భార్యతో మనస్పర్ధలు వచ్చాయి.దాంతో ఆమె  2016లో తనకు విడాకులు కావాలని కోర్టుని ఆశ్రయించింది. అయితే సదరు ఎన్నారై వద్ద అధిక మొత్తంలో ఆస్తులు ఉన్నాయని గుర్తించిన జడ్జి ఆ ఆస్తులని ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది.

 Related image

దాంతో ఆ తీర్పు చెప్పిన మహిళా న్యాయమూర్తి పై చిందులు తొక్కాడు. అసభ్యంగా మాట్లాడుతూ దూషించాడు.  చివరికి కేసు విచారణ పూర్తి కావడంతో తాజాగా కోర్టు అతడి రెండో భార్యకి రూ.130 కోట్లపైగా ఆస్తులివ్వాలని తీర్పు చెప్పింది. అంతేకాదు  నెలనెలా రూ.50 లక్షలపైగా రోజువారీ ఖర్చులు చెల్లించాలని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: