దుబాయ్ లో లాటరీలు నిర్వహించడం సర్వ సాధారణమే. అక్కడ లాటరీలు భారతీయులని వరించడం అనేది స్థానిక ప్రజలని కూడా ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏప్రియల్ నెలలో అబుదాబిలో జరిగిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ 12 మంది భారతీయులు బిగ్ టిక్కెట్ లాటరీని గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 12 మంది భారతీయులు కలిసి గెలుచుకున్న టిక్కెట్ట 15 మిలియన్ దిర్హామ్ల.

 Image result for /dh15m-raffle-ticket-makes-12-uae-expats-millionaires

12 మంది భారతీయులు కలిసి కెఎస్షోజిత్ అనే వ్యక్తి పేరిట ఈ లాటరీ టిక్కెట్టు ని కొనడం జరిగింది. ఈ టిక్కెట్టు దక్కుతుందా లేదా అనే ఆలోచనతోనే కొన్నామని, ఇంత పెద్ద మొత్తంలో మేము ఈ సొమ్ము గెలుచుకుంటామని ఊహించలేదని తెలిపారు. ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులు ప్రవాసులు గెలుచుకున్న లాటరీ టికెట్ చెక్‌ను వారికి ఇచ్చేందుకు వారు పని చేస్తున్న ప్రదేశానికి వెళ్ళారు..

 Image result for big ticket lottery

 ఆ భారతీయులు అందరూ స్థానికంగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళని, వివిధ ప్రాంతాల నుంచీ వచ్చి అందరూ ఒకే చోట పని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ లాటరీ టిక్కెట్టు గెలుచుకున్నారని తెలియగానే ఒక్క సారిగా వారి సంతోషానికి అవధులు లేవు. అనుకోకుండా వచ్చిన ఈ అదృష్టాన్ని తప్పకుండా ఆహ్వానిస్తున్నాం. ఇందులో కొంత సొమ్ముని సమాజ సేవకి ఉపయోగిస్తామని వాళ్ళు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: