అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత టెకీలకి తీపి కబురు చెప్పాడు. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డులని బిల్డ్ అమెరికా వీసాలతో భర్తీ చేస్తానని ట్రంప్ తెలిపారు. వలస వచ్చే వారికి ప్రతిభ ఆధారంగానే ఎంట్రీ ఉంటుందని కొత్త విధానాన్ని ట్రంప్ వివరించారు. ట్రంప్ ప్రవేసపెట్టిన విధానంలో అత్యున్నత నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోటాను 12 నుంచి 57 శాతం వరకూ పెంచనున్నారు.

 Image result for bild america green card

అమెరికాకి వలసదారులు రావాలని కోరుకుంటున్నాం. మా దేశ నిర్మాణంలో మీరు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే వలసదారుల్లో కేవలం ఎక్కువ భాగం తమ ప్రతిభ ద్వారా మాత్రమే రావాలని తేల్చి చెప్పారు ట్రంప్. ప్రపంచంలో మీరు ఎక్కడ వారైనా సరే, మీవద్ద ప్రతిభ ఉంటె చాలు వారిని మా దేశంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇదిలాఉంటే

 Image result for bild america green card

ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డ్ కేటగిరీలను కొత్త వీసాతో భర్తీ చేస్తామని అమెరికా అది బిల్డ్ అమెరికా వీసా' అని తెలిపారు. ప్రతీ ఏటా అమెరికా సుమారుగా 1.1 మిలియన్ల గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. ప్రస్తుతానికి చాలా వరకూ గ్రీన్ కార్డ్ లను కుటుంబ సంబంధాలు, వైవిధ్యం ఆధారంగానే ఎంపిక చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: