అమెరికాలో గన్ కల్చర్ హెచ్చు మీరుతోంది. ఈ గన్ కల్చర్ కి స్వస్తి పలకాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం గన్ కల్చర్ పై నిభంధలతో కూడిన బిల్లు కూడా ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారు. అయిన సరే అగ్ర రాజ్యం అమెరికా గన్ కల్చర్ ని మాత్రం నియంత్రించలేక పోతోంది.అందుకు ఉదాహరనే తాజాగా వర్జీనియాలో జరిగిన కాల్పులు.

 Related image

అమెరికాలోని వర్జీనియా బీచ్ నగరంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దాంతో అక్కడిక్కడే 11 మంది మృతి చెందగా సుమారు 10 కి పైగా గాయలపాలయ్యాడు. అయితే కాల్పులకి పాల్పడిన వ్యక్తి అదే నగరానికి చెందిన ప్రజాపనుల విభాగంలో సీనియర్ ఉద్యోగి అని తెలిపారు పోలీసు అధికారులు.అతడు ఒక్క చోట మాత్రమే కాల్పులు జరపలేదని రెండు భవనాలలో కాల్పులు జరిపాడని తెలిపారు.

 Related image

కాల్పులలో గాయపడిన వారిని వర్జీనియాలోని బీచ్ నగర ఆసుపత్రికి తరలిచి వైద్యం అందిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ ఘటన ఎంతో  దురదృష్టకరమని మేయర్ బాబీ డియర్ విచారం వ్యక్తం చేశారు. అయితే తన కార్యాలయంలో అధికారుల ఒత్తిడుల కారణంగా అతడు కాల్పులు జరిపాడా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతామని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: