అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క‌ఠిన ఆదేశాల నేప‌థ్యంలో...ఆ దేశ సైనికులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలా తాజాగా క‌ఠిన నిబంధ‌న‌ల‌తో ఓ భార‌తీయ బాలిక క‌న్నుమూసింది. ఆరిజోనా-మెక్సికో సరిహద్దులో భారత్‌కు చెందిన ఏడేళ్ల బాలిక మృతిచెందింది. మరో నలుగురు భారతీయులతో కలిసి బాలిక యూఎస్‌కు అక్రమంగా వలస వెళ్తుంది. వీరిలో ఇద్దరిని బొర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్స్ టస్కన్ ప్రాంతంలో కాల్చిచంపారు. మరో ఇద్దరు మెక్సికోకు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. పారిపోయిన వారి కోసం భూ, వాయు మార్గంలో తనిఖీలు చేపట్టారు.


కాగా, మెక్సికో సరిహద్దు ప్రాంతాల చుట్టూ గోడ కడుతానని ఇప్పటికే ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే మెక్సికో దేశంతో సరిహద్దు ఉన్న అమెరికా రాష్ట్రమైన ఆరిజోనా కూడా తమ బోర్డర్ వద్ద ప్రత్యేకంగా 150 దళాలను పంపించి గ‌స్తీ నిర్వ‌హిస్తోంది. ప్రతిపాదించిన గోడ నిర్మించే వరకు మెక్సికో బోర్డర్ ప్రాంతాన్ని సుమారు 4 వేల మంది నేషనల్ గార్డులతో గస్తీ నిర్వహించేందుకు ట్రంప్ ఆదేశాలివ్వ‌డంతో ఈ గ‌స్తీ కొన‌సాగుతోంది. టెక్సాస్, ఆరిజోనాతో పాటు న్యూ మెక్సికో, కాలిఫోర్నియా రాష్ర్టాలు కూడా సరిహద్దు వద్ద బందోబస్తును పెంచారు. ఈ నేప‌థ్యంలో తాజాగా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌ని మెక్సికో సరిహద్దులో ఎన్‌కౌంట‌ర్ చేశారు. కాగా, తాజా ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: