ఫాదర్స్ డే రోజున పిల్లలు అందరూ  నాన్నలకి బహుమతులు కొని ఇవ్వడమో లేక, దూరంగా ఉన్న వాళ్ళు ఒక్క సారిగా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడమో, ఇలా రకరకాలుగా తమ ప్రేమని వ్యక్త పరుస్తూ తండ్రితో సంతోషంగా గడుపుతారు. అయితే అమెరికాలో ఓ మహిళ ఫాదర్స్ డే రోజున తన తండ్రికి మరో జన్మ ఇచ్చింది. ఇప్పుడు ఆమె ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ తన తండ్రి కోసం ఆమె ఏమి చేసింది..??

 Image result for father day

టెక్సాస్ లో ఉండే టేలర్ అనే మహిళ తన తండ్రి అనారోగ్యంగా ఉన్నారని తెలుసుకుని ఆసుపత్రిలో చేర్చింది. వైద్య పరీక్షల అనంతరం ఆమెకి వైద్యులు చెప్పిన విషయం విని షాక్ అయ్యింది. తన తండ్రి కి ఒక కిడ్నీ పాదయ్యిందని, కిడ్నీ మార్చటం తప్ప వేరే అవకాశం లేదని అందులోనూ అతి త్వరగా కిడ్నీ మార్చాలని చెప్పడంతో ఆందోళనచెందిన ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా తన కిడ్నీ ఇస్తానని అందుకు పూర్తిగా సహకరిస్తానని వైద్యులకి తెలిపింది.

 Image result for texas-woman-has-given-her-dad-an-early-father’s-day-gif

దాంతో డాక్టర్లు ఆమె నుంచీ లిఖిత పూర్వకంగా హామీ తీసుకుని , వైద్య పరీక్షలు నిర్వహించి తన తండ్రికి ఆమె  కిడ్నీ సరిపోతుందని నిర్ధారించుకుని ఆమె తండ్రికి కిడ్నీ మార్పిడి చేశారు. ప్రస్తుతానికి ఆమె తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె చేసిన సాహసం ఎంతో గొప్పదని వైద్యులు మీడియాకి తెలిపారు. ఆనోటా ఈ నోటా తెలియడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది. ఆమె  తండ్రికి కిడ్నీ మార్పిడి చేయడం కూడా ఫాదర్స్ డే రోజు కావడంతో ఆమె తన తండ్రికి అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: