Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 4:08 am IST

Menu &Sections

Search

హెచ్1బీ వీసాల్లో కోత‌....ఇండియ‌న్ల‌కు అమెరికా ఇక క‌లేనా?

హెచ్1బీ వీసాల్లో కోత‌....ఇండియ‌న్ల‌కు అమెరికా ఇక క‌లేనా?
హెచ్1బీ వీసాల్లో కోత‌....ఇండియ‌న్ల‌కు అమెరికా ఇక క‌లేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అగ్ర‌రాజ్యం అమెరికా షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ భారత్‌ను దెబ్బతీసేందుకు అమెరికా హెచ్-1బీ వీసా అస్ర్తాన్ని ప్రయోగించనుంది. డాటా లోకలైజేషన్ చేస్తున్న దేశాలకు హెచ్-1బీ వీసాల్లో 10-15 శాతం కోత విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. అంతర్జాతీయ సంస్థలు భారతీయుల డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలంటూ కేంద్రం ఇటీవల కొత్త నిబంధలను తీసుకొచ్చింది. ఇది పలు అమెరికా కంపెనీలకు ఆర్థికంగా భారం కానుంది. ఈ నేపథ్యంలో భారత ఐటీ రంగాన్ని దెబ్బతీసేందుకు హెచ్-1బీ వీసాల అంశాన్ని తెరపైకి తెచ్చింది.


 అమెరికా ఏటా జారీ చేసే 85వేల హెచ్-1బీ వీసాల్లో 70 శాతం వరకు భారతీయులే పొందుతున్నారు. ఏటా ఇండియన్లకు ఇస్తున్న హెచ్​1బీ వీసాల్లో 10 నుంచి 15 శాతం కోత పెట్టాలని అమెరికా నిర్ణయించినట్టు గతవారమే తమకు ప్రభుత్వం వివరించిందని ఇద్దరు సీనియర్​ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల పప్పులుడకకుండా వాటి అధికారాలను తగ్గించేందుకు ఇండియా తీసుకున్న ‘డేటా లోకలైజేషన్​’పైనే అమెరికా ఈ వీసా తగ్గింపు నిర్ణయం తీసుకుందన్నారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అయితే, ఒక్క ఇండియా మాత్రమే కాకుండా డేటా లోకలైజేషన్​కు డిమాండ్​ చేసే దేశాలన్నింటికీ ఇది వర్తించేలా నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఏ దేశమైతే డేటా లోకలైజేషన్​కు డిమాండ్​ చేస్తుందో ఆ దేశానికి ఏటా ఇచ్చే వీసాల్లో 15 శాతం వీసాలను కోత పెట్టేందుకు డిసైడ్​ అయిందన్నారు. అమెరికా ట్రేడ్​ రిప్రజెంటేటివ్​ (యూఎస్​టీఆర్​) ఆఫీస్​కు చెందిన ఓ మహిళా ప్రతినిధి.. విదేశాంగ శాఖను ఇదే విషయంపై ప్రశ్నించినా స్పందించలేదు.
వీసాల‌ను తగ్గించాలన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారీగా ప్రభావం పడేది మాత్రం ఇండియన్​ కంపెనీలపైనేనని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​), ఇన్ఫోసిస్​లపైనే ప్రభావం ఎక్కువుంటుందని అంటున్నారు. అయితే, అమెరికా నిర్ణయంతో దేశంపై పడే ప్రభావమేంటో వెంటనే తేల్చాల్సిందిగా అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించినట్టు సమాచారం. విదేశాంగ శాఖ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇక, విదేశీ కంపెనీల పేమెంట్స్​ డేటాను ‘ఇండియాలోనే’ స్టోర్​ చేయాలని గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం రూల్​ పెట్టింది. సున్నితమైన అంశాలను ప్రాసెస్​ చేసే విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగానే డేటాను ఇక్కడే స్టోర్​ చేయాలని కంపెనీలను ఆదేశించింది. దీని వల్ల అమెరికా కంపెనీలైన మాస్టర్​కార్డ్​, వీసా వంటి కంపెనీలు భారీగా నష్టపోయాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి రూల్స్​ పెట్టడం వల్ల దేశాల మధ్య డేటా మార్పిడి ఆగిపోతుందని, కంపెనీలకు ఖర్చు పెరుగుతుందని కొందరు నిపుణులు విమర్శలు గుప్పించారు.


h1b
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచు మ‌నోజ్‌కు అక్క‌డ ఓట‌రు కార్డు...షాక్ తిన్న అధికారులు
మోదీ చేసిన ప‌నికి...న‌వ్వుల పాల‌వుతున్న మ‌హిళా ఎంపీ
బ్రేకింగ్ఃఅమెరికాకు జ‌గ‌న్‌...వాళ్ల కోరిక మేర‌కే!
అనుకున్న‌దే జ‌రిగింది...బీజేపీ కండువా క‌ప్పుకొన్న టీఆర్ఎస్ ప్ర‌ముఖ నేత‌
వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో శృంగారం...లార్డ్స్ మైదానంలో అంద‌రూ చూస్తుండ‌గానే...
చిరంజీవి లాగే చంద్ర‌బాబు...బుద్ధా వెంక‌న్న క‌ల‌క‌లం
ఈ ద‌స‌రాకు కేసీఆర్ స్పెష‌ల్ ఏంటో తెలుసా?
ఎమ్మార్వో లావ‌ణ్యకు ఆయ‌నే బినామీ...అవాక్క‌య్యే నిజాలు
సీటు కోసం సిద్ధ‌రామ‌య్య కొత్త స్కెచ్‌...ఆఖ‌రిగా ఏం చేశారంటే..
ఢిల్లీ పెద్దాయ‌న‌తో కేసీఆర్ బీపీ పెంచిన కోదండ‌రాం
జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో లోకేష్‌కు జాబ్...ఇంట‌ర్వ్యూకు రిఫ‌రెన్స్ ఇచ్చిన విజ‌య‌సాయిరెడ్డి
ఇన్ఫోసిస్‌ మూర్తి యువ‌త‌కు ఇలాంటి మాట‌లు చెప్పాడేంటి?
నాలిక మ‌డ‌తేసిన కోమ‌టిరెడ్డి...అబ్బే కాంగ్రెస్‌ను  నేనెందుకు వీడుతా?
బిగ్ న్యూస్ః అధికార పార్టీకి షాక్‌...107 మంది ఎమ్మెల్యేలు జంప్‌
జ‌న‌సేన ఇంకేం చెప్తుంది...బ‌డ్జెట్‌పై అదే మాట‌
ఆమ్ర‌పాలికి బంప‌ర్ ఆఫ‌ర్‌...ఇందుకేనా కిష‌న్‌రెడ్డి ఎంచుకుంది?
బాబుకు వైసీపీ సంచ‌ల‌న స‌వాల్‌...స్పందించే ద‌మ్మందా?
సీనియ‌ర్ నేతకు ముఖ్య‌ప‌దవి...న‌మ్ముకున్నందుకు న్యాయం చేసిన జ‌గ‌న్‌
శ్రీ‌దేవిని చంపేశారు...బోనీక‌పూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్‌పై ఉద్య‌మం...కోదండ‌రాం కొత్త‌ స్కెచ్‌?
కిడారి హ‌త్య‌కేసు...ఎన్ఐఏ కీల‌క నిర్ణ‌యం
హ‌మ్మ‌య్య‌...చార్జీల బాదుడుపై ఎట్ట‌కేల‌కు ఎస్‌బీఐ గుడ్ న్యూస్!
సోనియాకు కాంగ్రెస్ నేత‌ల కొత్త ప్ర‌తిపాద‌న‌...ఆమె ఓకే అంటే...
క‌ర్ణాట‌క ఎపిసోడ్‌...బీజేపీ కొత్త రాజ‌కీయం..ప్లాన్ వ‌ర్కౌట్ అయితే అంతే...
క‌ల నెర‌వేర్చుకునేందుకు కేసీఆర్ ప్ర‌త్యేక స్కెచ్‌
బీజేపీలోకి నాదెండ్ల మ‌నోహ‌ర్...భాస్క‌ర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
అవినీతి ఎమ్మార్వో క‌ల‌క‌లం...ఆమె కాళ్లు ప‌ట్టుకొని వేడుకొని....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.