2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల‌కు ఇప్ప‌టి నుంచే...హీట్ మొద‌లైంది. అమెరికా రాజకీయాల్లో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్న పలువురు భారతీయ అమెరికన్లు దేశ అధ్యక్ష పదవికీ పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారిస్ 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీకి దిగుతానని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత సంతతి సెనేటర్‌గా ఆమె రికార్డులకెక్కారు. డెమోక్రాట్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న 23 మందికి ఆమె గట్టి పోటీనిస్తున్నారు. ట్రంప్ విధానాలపై నిశిత విమర్శలతో దేశ ప్రజలను ఆకర్షిస్తున్న కమల.. కార్పొరేట్ రాజకీయ కార్యాచరణ కమిటీలు, ఫెడరల్ లాబీయిస్టుల నుంచి విరాళాలను తిరస్కరిస్తానని వాగ్దానంచేశారు.


కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి సెనెటర్ కమలా హారిస్ (54) గత ఆరు నెలల్లో 2.3 కోట్ల డాలర్లకు పైగా విరాళాలు సేకరించారు. ద్వితీయ త్రైమాసికంలో 2.79 లక్షల మంది నుంచి సుమారు 1.2 కోట్ల డాలర్ల విరాళాలు సేకరించారు. వారిలో 1.50 లక్షల మంది కొత్తవారు. డిజిటల్ చెల్లింపుల్లోనే 70 లక్షల డాలర్ల విరాళాలు లభించాయి. యుక్త వయస్కురాలిగా ఉన్న తన ఫోటోపై దట్ లిటిల్ గర్ల్ వాజ్ మీ అనే నినాదం ప్రచురించిన టీ-షర్టుల విక్ర యంతోనూ విరాళాలను సేకరిస్తున్నారు.ఇదిలాఉండ‌గా, ట్రంప్ విధానాలను విమర్శిస్తూ కమలా హ్యారిస్ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి నామినేషన్ కోసం పోటీ పడుతున్న వారిలో హ్యారిస్ నాలుగో వ్యక్తి. నేను అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నా అని ఆమె ట్వీట్ చేశారు. కమలా హ్యారిస్: ప్రజల కోసం అన్న నినాదం తన ప్రచారాంశమని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: