జపాన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జపాన్ యొక్క పురాతన రాజధాని క్యోటోలోని మూడు అంతస్తుల క్యోటో యానిమేషన్ భవనంలో మంటలు చెలరేగాయి. తీవ్రంగా కాలిన గాయాలతో ఒకరు మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి సతోషి ఫుజివారా తెలిపారు. మూడు అంతస్తుల భవనం లో పై అంతస్తులో 10 మందికి పైగా చనిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
మంటలలో మరో 36 మంది గాయపడ్డారు, వారిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారని జపాన్ అధికారులు తెలిపారు. క్యోటోలోని యానిమేషన్ ప్రొడక్షన్ స్టూడియో పేలి మంటలు ఎగిసిపడ్డాయి. జపనీస్ మీడియా ప్రకారం ఒక వ్యక్తి ద్రవాన్ని డంప్ చేసి మంటలను రేపాడు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లు భావించారు మరియు ఇంకా డజను పైగా లోపల చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. మీడియా చెప్పిన కధనం ప్రకారం ఈ సంగటన జరిగినప్పుడు 70 మంది దాక బిల్డింగ్ లో ఉన్నారు.
బిల్డింగ్ లో అందరూ ప్రాణ భయంతో భయటకి పరిగెత్తారని చెప్పారు. దీనితో అనుమానస్పద వ్యక్తిని అధుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.దాడి చేసిన వ్యక్తిని చూసిన వారు అతని తమ సహోద్యోగి కాదని వెళ్ళడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: