అమెరికాలోకి వృత్తి నిపుణులు ఎంట్రీ ఇవ్వడానికి హెచ్ -1బీ వీసా ప్రధాన ముఖ ద్వారం ఈ వీసా ద్వారా మాత్రమే నిపుణులు అమెరికాలోకి వెళ్ళగలరు. తాజాగా ఈ వీసాపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిభందనలు కూడా అందరికి తెలిసినవే అయితే. ఈ వీసా ద్వారా అమెరికా వసూలు చేస్తున్న ఫీజులని అమెరికా ప్రజల శిక్షణకోసం ఉపయోగిస్తారట. ఈ విషయాన్ని వాణిజ్య మంత్రి మంత్రి విల్బర్‌ రాస్‌ తెలిపారు.

 Image result for h1b visa

వివిధ కంపెనీలు అమెరికన్ల కి శిక్షణ ఇచ్చేలా ట్రంప్ యంత్రాంగం  “ఇండస్ట్రీ -రికగ్నైజ్డ్‌ అప్రెంటిస్‌షిప్‌ సిస్టం” అనే విధానాన్ని తీసుకువచ్చింది. హెచ్ -1బీ వీసా ఫీజు ద్వారా సుమారు రూ.688 కోట్లను కార్మిక శాఖ 30 రకాల అప్రంటీస్ షిప్ గ్రాంట్ గా అందించిందని అన్నారు.అయితే ఈ ఫీజుని విదేశీ ఉద్యోగులని నియమించుకున్న కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

 Related image

ఇదిలాఉంటే అమెరికా వలస విభాగం విధానాల కారణంగా హెచ్ -1బీ వీసా జారీ ప్రక్రియ ఆలస్యం అవుతోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఎలెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తులు ఒక సారి పంపిన తరువాత పొందు పరిచిన వివరాలనే మళ్ళీ పంపాలని అడుగుతున్నారని, ఆమె మండిపడ్డారు. గతంలో కంటే కూడా ఇప్పుడు వీసా పెండింగ్ ఘటనలు ఎక్కువ అయ్యాయని తెలిపారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: