పాస్‌పోర్ట్‌ను ఇక నుంచి ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. దీని కోసం ముందుగా పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. తర్వాత ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌ సమర్పించవచ్చు. డబ్బు చెల్లింపు సమయంలోనే మీకు నచ్చిన ఆఫీస్‌లో అపాయింట్‌మెంట్‌ ఎంచుకునే సౌకర్యం కూడా ఉంది. డబ్బు సంపాదన, ఉపాధి, ఉన్నత విద్య.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌కు పాస్‌పోర్ట్‌ తప్పనిసరి. దీన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది.


ఇది వరకు పాస్‌పోర్ట్‌ కోసం కచ్చితంగా పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఇ-అప్లికేషన్‌ పేరుతో కొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ముందుగా పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌ హోమ్ పేజీలోని అప్లై సెక్షన్‌‌‌లో కనిపించే రిజిష్టర్ లింక్ పై క్లిక్ చేయటం ద్వారా రిజిష్ట్రేషన్ ప్రకియను ప్రారంభించాలి. 


రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తరువాత పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్‌ను పొందేందుకు "Pay and Schedule Appointment" అనే లింక్ పై క్లిక్ చేయండి. బుకింగ్ అపాయింట్‌మెంట్‌‌లకు ఆన్‌లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి మీ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబందించి ఆన్‌లైన్ చెల్లింపును క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేపట్టాలి.


డబ్బులు చెల్లించిన తర్వాత ప్రింట్‌ అప్లికేషన్‌ రిసిప్ట్‌పై క్లిక్‌ చేయాలి. అప్లికేషన్‌ రిసిప్ట్‌ ప్రింట్‌ తీసుకోవాలి. దీనిపై అప్లికేషన్‌ రెఫరెన్స్‌ నెంబర్‌ లేదా అపాయింట్‌మెంట్‌ నెంబర్‌ ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడైతే అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోన్నారో ఆ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌కు వెళ్లాలి. ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: