అమెరికా లోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా నూతనంగా ఫౌండేషన్, ట్రస్ట్ బోర్డ్ ఛైర్మెన్ లని ఎంపిక చేసింది. ఫౌండేషన్ ఛైర్మెన్ గా శృంగవరపు నిరంజన్ ఎంపిక కాగా ట్రస్ట్ బోర్డ్ ఛైర్మెన్ గా హరీశ్ కోయ ఎంపిక అయ్యారు. అయితే నిరంజన్ ఛైర్మెన్ గా ఎంపిక కావడం ఇది రెండో సారి కావడం గమానార్హం. రాబోయే రెండేళ్ళు వీరు ఛైర్మెన్ లుగా వ్యహరిస్తారు.

 Image result for tana foundations logo

అమెరికాలో, రెండు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు చేపట్టడం వీరి ముఖ్య లక్ష్యం. సుమారు 40 వేల మంది సభ్యులు ఉన్న తానా సంఘంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ఫౌండేషన్ కమిటీ , బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ ఇలా మూడు విభాగాలు ఉంటాయి. ట్రస్ట్ బోర్డ్ కార్యదర్శిగా వెన్నం      మురళి ఎంపిక కాగా కోశాధికారిగా జగదీష్ ఎంపిక అయ్యారు.

 Related image

నూతనంగా ఏర్పడిన ఈ కమిటీలు అన్నీ తానా చేపట్టే సేవా, చైతన్య కార్యక్రమాల్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి ట్రస్టీ లని ఎన్నుకుంటారు. ఈ ట్రస్టీ లలో ఒకరిని బోర్డ్ ఛైర్మెన్ ఎంపిక చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: