అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఆ దేశ వ్యాప్తంగా డెమొక్రటిక్ పార్టీ తరుపున దాదాపు 24 మంది పోటీ బరిలో ఉన్నారు. అధికార రిపబ్లికన్ పార్టీ తరుపునుంచీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఉండగా ట్రంప్ పై పోటీ గా చాలా మంది పోటీ పడుతున్నారు.  అమెరికా ప్రజలని ఆకర్షించడానికి అభ్యర్థులు చేయని ఫీట్లు,పాట్లు లేవు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో సరికొత్త పద్దతులని పాటిస్తూ ఓటర్లని ఆకర్షిస్తున్నారు.


డెమోక్రటిక్ పార్టీ తరుపునుంచీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న  టిమ్ రియాన్ తన ఎన్నికల నిధుల కోసం    సరికొత్త ప్రచారం చేస్తున్నారు. అందుకు భారతీయ యోగా విధానాన్ని అమలు చేస్తున్నారు.


ఆరోగ్య పరిరక్షణ విధానానికి ప్రజా మద్దతు కూడగట్టే విధంగా అదే సమయంలో తన ప్రచార నిధులు సమకూర్చుకోవడానికి గాను  యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో తనతో పాటు యోగా చేయాలనుకునే వారు మూడు డాలర్లు విరాళంగా ఇవ్వాలని కోరారు..ఇలా వచ్చిన సొమ్ముతో తన పార్టీ ప్రచార ఖర్చుతో పాటు కొంతమందిని డ్రా ద్వారా ఎంపిక చేసి న్యూయార్క్ ట్రిప్ కి పంపుతామని ప్రకటించారు దాంతో యోగా శిబిరానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: