అమెరికాలో ఉద్యోగం చేయడానికో , లేదా చదువుకోవడానికో వీసా అనేది చాలా ముఖ్యమైనది, అందుకోసం విదేశీయులు పడని పాట్లు లేవు. ముఖ్యంగా భారతీయులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఒబామా హయాంలో వీసా పొందటం ఎంతో సులువుగా ఉన్నా, ట్రంప్ ప్రభుత్వ హయాంలో మాత్రం వీసా చేతికి వచ్చే సందేహమే. అయితే అమెరికాలో ఉంటూ వీసా రెన్యువల్ చేసుకునే సమయంలో కూడా తమ ఆలస్యం అవుతోందని, వీసాలని తిరస్కరిస్తున్నారని ఎంతో మంది భారతీయులు వాపోతున్నారు.

 Image result for indian three-indian-asylum-seekers-on-hunger-strike-forced-to-hydrate

ఈ క్రమంలోనే అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిటెన్షన్‌ సెంటర్ వద్ద ముగ్గురు భారతీయులు దాదాపు 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తమపై బహిష్కరణ వేటు వేశారని, డిటెన్షన్‌ లో ఉంచారని వెంటనే తమపై బహిష్కరణ ని ఎత్తివేసి, డిటెన్షన్‌ నుంచీ పంపివేయాలని, అమెరికాలో తమకి ఆశ్రయం కలిపించాలని వారు కోరారు.

 Image result for indian three-indian-asylum-seekers-on-hunger-strike-forced-to-hydrate

ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తున్న ఈ ముగ్గురు భారతీయులు జులై 9న దీక్షకు దిగారని తెలుస్తోంది.వారి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోందని వారి ముగ్గురికి  ఐవీ ప్లూయిడ్స్‌ ఎక్కించామని అధికారులు తెలిపారు. అయితే ఇమ్మిగ్రేషన్ కోర్టులు తమ పట్ల వివక్ష చూపుతున్నాయని తమపై కేసులని ఎత్తివేయాలని కోరినా తిరస్కరిస్తున్నారని వారు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: