నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణం నిలబెట్టడానికి నాట్స్  “రన్ ఫర్  రామ్” పేరుతో విరాళాలు సేకరించింది. ఈ కార్యక్రమంలో విశేషం ఏమిటంటే. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు అన్నీ నాట్స్ చేస్తున్న రన్ కి మద్దతుగా నిలిచాయి. తానా, ఆటా, వంటి సంస్థలు ఈ ఈవెంట్ కి మద్దతు తెలిపాయి. దాంతో ఎంతో మంది తెలుగు ఎన్నారైలు ఈ రన్ లో పాల్గొన్నారు. వివరాలలోకి వెళ్తే.

 

అమెరికాలో కొయ్యలమూడి రామ్మూర్తి పేరు తెలియని తెలుగు వారు ఉండరు. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేపట్టడంలో తనకి ఉన్న దానిలో కొంత మేరకు డబ్బుని సేవకు ఉపయోగిస్తూ ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తూ అందరికి సుపరిచితుడు అయ్యారు. కొన్ని నెలల క్రితం  రామ్మూర్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ మేరకు అధిక మొత్తంలో డబ్బు ఖర్చు కానున్న తరుణంలో ఆయన కోసం ఎంతో మంది విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

 

ఈ క్రమంలోనే నాట్స్ కూడా తనవంతు సాయంగా ...“రన్ ఫర్ రామ్ పేరుతో 5 కే రన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బుని  రామ్మూర్తి ఆరోగ్య నిమ్మిత్తం అయన కుటుంభ సభ్యులకి అందచేస్తామని తెలిపింది. దాంతో నాట్స్ పిలుపుకి దాదాపు 120 మంది తెలుగు ఎన్నారైలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: