అమెరికాలో న్యూయార్క్ లో కొన్ని నెలల క్రితం  అక్కడి కంప్యూటర్స్ పని చేయకుండా చేసి యూనివర్సిటీకి నష్టం కలిగించాడు అనే కోణంలో ఎపీలోని చిత్తూరు జిల్లాకి చెందిన ఓ విద్యార్ధిని యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదోపవాదాలు విన్న తరువాత తాజాగా తీర్పుని వెల్లడించింది.

 Image result for indian student arrest in us

చిత్తూరు జిల్లాకి చెందినా ఆకుతోట విశ్వనాద్ విద్యార్ధి స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్ళాడు. అక్కడ న్యూయార్క్ లోని ఓ యూనివర్సిటీలో చేరి ఎంఎస్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఒక రోజు విశ్వనాద్ కంప్యూటర్ ల్యాబ్ లోని 66 కంప్యూటర్స్ లో యూఎస్బీ కిల్లర్ డివైజ్ ఇంస్టాల్ చేసి కంపూటర్లు పాడయ్యేలా  ఉద్దేస్యపూర్వకంగానే చేశాడని యూనివర్సిటీ వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు.

 Related image

ఈ కిల్లర్ డివైజ్ యూఎస్బీ బోర్డ్ లోకి చేరినపుడు కెపాసిటర్లు వేగవంతంగా పని చేయడం జరుగుతుంది. దాంతో పాటు పదేపదే డిశ్చార్జ్ అయ్యేలా చేస్తుంది. దాంతో ఓవర్ లోడ్ అయ్యి అన్ని కంప్యూటర్స్ పాడవుతాయి. ఇది ఉద్దేస్య పూర్వకంగా చేశాడని నిర్ధారించిన స్థానిక కోర్టు అతడికి ఏడాది జైలు శిక్ష తో పాటు, సుమారు 14 లక్షల భారీ జరిమానా విధించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: