అమెరికా వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన ఫేక్ యూనివర్సిటీల భాగోతం. ఈ ఫేక్ యూనివర్సిటీల కారణంగా అధికశాతం మంది భారతీయులే నష్టపోయారు. ఆ సమయంలో భారతీయ విద్యార్ధులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చదువుకోవాలని అమెరికా వెళ్తే , మోసపోవడమే కాకుండా దొంగలని ఉంచినట్టు అందరిని ఒకే ప్రదేశంలో ఉంచారు.

 Image result for good-news-for-indian-students-caught-in-visa-sting

 

కొంతమందికి చేతికి మైక్రో హ్యాండ్ , లెగ్ బ్యాండ్లు వేసి వారు కదలికల్ని గుర్తించేవారు. దాదాపు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు భారత విద్యార్ధులు.ఈ యూనివర్సిటీలలో కావాలనే మోసపూరితంగా చేరారు, అందరి వీసాలని రద్దు చేసి వీరిని వారి వారి స్వదేశాలకి పంపాలని అధికారులు కోర్టులో వాదించారు. అయితే ఈ విషయంపై మోసపోయిన విద్యార్ధులు అందరూ అదే కోర్టుని ఆశ్రయించారు.

 Image result for philadelphia high court

అయితే సుమారు మోసపోయిన 500 మంది విద్యార్ధులు అందరూ కలిసి అమెరికా ప్రభుత్వంపై కోర్టుకి వెళ్ళారు. తమ వాదనలు వినాలని కోర్టుని ఆశ్రయించారు. తాజాగా ఈ విజ్ఞప్తి పై ఫిలడెల్ఫియా కోర్టు స్పందించింది. మీకు అవకాశం ఇస్తున్నాం అంటూ ప్రకరించింది. దాంతో మోసపోయిన విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: