అగ్రరాజ్యం అమెరికా భారత్ కి చెందిన అయిదుగురు విద్యార్ధినులకి ఆహ్వానం పంపింది. అంతేకాదు ఇప్పుడు ఈ అయిదుగురు అమ్మాయిల కోసం టాప్ కంపెనీలు సైతం ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ వీళ్ళు చేసింది ఏమిటి అంటే వాళ్లకి వచ్చిన ఒక్క ఐడియా ఇప్పుడు వారిని అందరికంటే ముందు వరుసలో ఉంచేలా చేసింది. ఇంతకీ వారికి వచ్చిన ఐడియా ఏమిటంటే..

 

ఈ ఐదుగురు విద్యార్ధినులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా కి చెందిన వారు. అక్కడ  అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్నారు. అయితే అందరిలా స్కూల్ కి వెళ్ళాము చదువుకుంటున్నాం అన్నట్టే కాకుండా ఎదో ఒకటి సాధించాలని తపన పడ్డారు. ఈ క్రమంలోనే సమాజంలో తలత్తే సమస్యలకి పరిష్కారం కనుగొనాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనలకి పదునుపెట్టారు.

 

ఈ సంవత్సరం జరిగిన టెక్నోవేషన్ గర్ల్స్ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నారు. దాదాపు 19 వేల మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పోటీలలో  38 దేశాల నుంచీ సుమారు 170 వరకూ టీమ్స్ సెమీస్ కి చేరాయి. ఇలా సెమీస్ కి చేరిన వారిలో భారత్ కి చెందిన టెక్ విచేస్ బృందం కూడా ఉంది. ఈ బృందంలో ఈ ఐదుగురు మహిళలు ఉన్నారు. వీరు మైత్రి పేరుతో ఓ సరికొత్త యాప్ ని సృష్టించారు. అనాధాశ్రయములో ఉండే వృద్దులలో, పిల్లలలో ఒంటరి తనం పోగొట్టడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.

 

\

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: