అమెరికాలో స్థిరపడిన ఎంతో మంది తెలుగు వారు తమ పిల్లలకి భారతీయ సంస్కృతీ సాంప్రదాయలని నేర్పుతూ భావిష్యత్తు తరాలకి భారతీయత చాటి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. పాశ్చాత్య పోకడులకి పుట్టినిల్లుగా ఉన్న అమెరికా వంటి దేశంలో భారత సంస్కృతిని పిల్లకి తెలిసివచ్చేలా చెప్పడమే కాకుండా అనుసరించే విధంగా చేయడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ఎంతో మంది ఇండో అమెరికన్ పిల్లలు భారతీయ కళలని అమెరికాలో ప్రదర్శిస్తూ భారతదేశ గొప్పదనాన్ని, చరిత్రని చాటి చెప్తున్నారు. ఈ కోవలోనే ఏపీ కి చెందిన ఓ కుటుంభం తమ కుమార్తెకి భారతీయ కళలలో ఎంతో ప్రభావితం అయిన కూచిపూడి నృత్యాన్ని నేర్పించారు.

 Image result for telugu girl dancing in white house

సిద్దాబత్తుల అంబికా శ్రీ  అమెరికాలో  ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు అంటే ఆశ్చర్య పోతారు. కూచిపూడి నృత్య ప్రదర్శనకి అమెరికాలో ఆమె పెట్టింది పేరు. ఎన్నో రికార్డ్ లు ఆమె తన నృత్య ప్రదర్శన ద్వారా సొంతం చేసుకుంది.  ఈ క్రమంలోనే ఆమె అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో సైతం నృత్య ప్రదర్శన ఇచ్చింది. దాంతో ఒక్క సారిగా ఆమె పేరు అమెరికాలో మారు మొగిపోయింది.

 Image result for kuchipudi dance

అంబిక శ్రీ నృత్యం లోనే కాదు చదువులో కూడా ముందు ఉంటుంది. అమెరికాలోని విద్యని అభ్యసిస్తున్న ఆమె చదువుతో పాటు నృత్యాన్ని నేర్చుకుంటూ భారత దేశ ఖ్యాతిని వెలుగింప చేయడం ఎంతో గర్వకారణమనే చెప్పాలి. అంతేకాదు 2008 లో కాలిఫోర్నియాలో,  2012 హైదరాబాద్ లో చేసిన నృత్య ప్రదర్సనలకి గాను ఆమె గిన్నిస్ బుక్ లో రెండు సార్లు స్థానం సంపాదించారు. మంచి నృత్య కళాకారిణిగా పేరు తెచ్చుకుని, తమ కుటుంభానికి, తన జన్మ భూమికి మంచి పేరు తీసుకురావడమే తన ఆకాంక్ష అంటోంది అంబిక శ్రీ...


మరింత సమాచారం తెలుసుకోండి: