అమెరికా వాసులని గన్ కల్చర్ ఎంతగా భయపెడుతుందో, దానికంటే కూడా ఎక్కువగా భయపెట్టేది అక్కడ తరచుగా  వచ్చే టొర్నడోలు,  భీకర హరికేన్ లు. అమెరికాలో ఇవి రావడం సర్వ సాధారణం. కాగా వీటి రాకని ముందుగానే పసిగట్టే టెక్నాలజీ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం, అధికారులు హెచ్చరికలు జరీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజగా

 

అమెరికాలోని ఫ్లోరిడా వాసులకి అక్కడి స్థానిక ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని డోరియన్ గా నామకరణం చేశారు. ఇది తీరం దాటాక ముందో ఫ్లోరిడా వాసులకి వణుకు పుట్టిస్తోంది. పాలం బీచ్ కి సుమారు  595 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ తుఫాను గంటకి సుమారు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తోందని తెలుస్తోంది.

 

ఈ భీకర డోరియన్ ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముదస్తూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫ్లోరిడాలోని సుమారు 26 కౌంటీలలో ఎమర్జన్సీ ని ప్రకటించారు. ఇది నేరుగా సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉందని, కావున ప్రమాదం పెద్దగా ఉండదని అంచనాలు వేస్తున్నారు. గంటకి 225 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంటున్నారు నిపుణులు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: