హైదరాబాద్ కి చెందిన ఓ యువకుడు తనకి విదేశాలలో ఉద్యోగం వచ్చిందని గత రెండేళ్ళుగా తన తల్లి తండ్రులని మోసం చేస్తూ వచ్చాడు. తల్లి తండ్రులు కూడా తమ కొడుకు విదేశాలలో ఉద్యోగం అందరికి చెప్పుకుని మురిసిపోయేవారు. మంచి ఉద్యోగం ఇంకేం తరువాత పెళ్ళే. తమ కొడుకుకి పెళ్లి సంభంధం చూసి 15 రోజుల్లో పెళ్లి ఫిక్స్ చేసి రమ్మన్నారు. ఇక్కడే కధ  అడ్డం తిరిగింది. అతడు కిడ్నాప్ అయ్యాడు.

 

కొడుకు లండన్ నుంచీ వచ్చేస్తున్నాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నతల్లి తండ్రులకి ఓ ఫోన్ కాల్ వచ్చింది కొడుకు నుంచీ అమ్మా నాన్నా నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో ఆందోళన చెందినా వారు పోలీసులకి ఈ విషయం చెప్పి ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ ట్రేస్ చేశారు. అయితే ఈ ఫోన్ చెన్నై నుంచీ వచ్చిందని చెప్పడంతో షాక్ అయ్యారు తల్లి తండ్రులు. ఫోన్ ట్రేస్ చేసి చెన్నై పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకోగా అసలు విషయం బయటకి వచ్చింది.

 

లండన్ లో ఉద్యోగం అని చెప్పి అతడు చెన్నై లో ఉంటున్నాడు. గత రెండేళ్ళు గా తల్లి తండ్రులని మోసం చేస్తూనే ఉన్నాడు. విదేశాలలో ఉంటున్న సాకుతో సుమారు 50 లక్షలు అప్పు చేశాడని తన స్వస్థలానికి వెళ్తే తప్పకుండా అప్పుల వాళ్ళు చుట్టూ చేరుతారని భావించి ఈ కిడ్నాప్ డ్రామా ఆడాడు అని పోలీసులు తల్లి తండ్రులకి తెలిపారు. అతడిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని అతడి తల్లి తండ్రులు కేసు వాపసు చేసుకున్నారని పోలీసులు తెలిపారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: