బ్రిటన్ లో  విద్యనభ్యసిస్తున్న ఎంతో మంది విదేశీ విద్యార్థులకు బ్రిటన్ గుడ్ న్యూస్ తెలిపింది. వర్క్ వీసాలో పాత నిబంధనలని మార్పు చేయాలని విద్యార్థులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వర్క్ వీసాల విషయంలో మార్పులు వలన భారతీయ విద్యార్థులకు భారీగా లబ్ధి చేకూరుతోందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ మాస్టర్ డిగ్రీ పూర్తయిన తరువాత కేవలం నాలుగు నెలలు మాత్రమే బ్రిటన్ లో ఉండే అవకాశం ఉంది.

 

అయితే  27 వర్సిటీలు పైలెట్ ప్రాజెక్టు కింద ఆరు నెలల పాటు బ్రిటన్ లో  ఉండే అవకాశాన్ని కల్పిస్తాయి అయితే వీసా నిబంధనలను సడలించడం తో చదువు పూర్తయ్యాక దాదాపు రెండేళ్లు బ్రిటన్లో ఉండవచ్చని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయవచ్చని తెలుస్తోంది. డిగ్రీ పూర్తయిన తరువాత కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉండే అవకాశాన్ని ఇస్తే ఉద్యోగాలు ఎలా సంపాదించుకుంటారు అనే కోణంలోనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 

విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడంతో వర్సిటీలు అన్నీ ప్రభుత్వంతో ఎన్నో సార్లు చర్చలు జరిపాయి. గత ఆరేళ్లుగా ఈ విధంగా చర్చలు జరిగిన తరువాత ఎట్టకేలకి తాజా నిబంధనలను ప్రభుత్వం ప్రవేసపెట్టింది. గతంలో అంటే 2012కు ముందు ఈ రెండేళ్ల నిబంధన అమలులో ఉండేదని అయితే 2012 లో హోం మంత్రిగా ఉన్నధెరిసా ఈ  నిబంధనలను రద్దు చేశారని , దాంతో బ్రిటన్ వచ్చే భారతీయుల సంఖ్య దాదాపు సగానికి సగం పడిపోయిందని, మళ్లీ వీసా నిబంధనలలో మార్పులు చేయడం వలన బ్రిటన్ కి  వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి

 


మరింత సమాచారం తెలుసుకోండి: