అమెరికాలో ఉంటున్న ఎనిమిది మంది ప్రవాస భారతీయులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఈ 8 మంది  వ్యక్తుల పై నిఘా పెట్టిన పోలీసులు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి వీరిని పట్టుకున్నట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది. ఇటీవలే భారత్ కి వెళ్లి తిరిగి వచ్చిన వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరు చేస్తున్న డ్రగ్స్ మాఫియా గుట్టును రట్టు చేసినట్టుగా తెలుస్తోంది.


భారత్ నుంచి అమెరికాకు డ్రగ్స్ ను ఈ 8 మంది ముఠాగా ఏర్పడి దిగుమతి చేసుకుంటున్నట్లుగా పోలీసుల  విచారణలో తెలియనట్లుగా తెలుస్తోంది. భారత్ లో  ఉన్న స్మగ్లింగ్ సంస్థలు వీరికి ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయి. తప్పుడు లేబుల్స్ తో ఉన్న ఈ డ్రగ్స్ ని  అమెరికాలోకి ఈ ఎనిమిది మంది తీసుకువచ్చారు ఇక్కడికి వచ్చిన తరువాత ఎవరెవరికి ఎంత మోతాదులో డ్రగ్స్ వెళ్ళాలో  ముందుగానే భారత్ లో వివరించి  చెప్పినట్లుగా తెలుస్తోంది.


అమెరికాలో ఉంటున్న ఈ 8 మంది 2017 నుంచి అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గా పోలీసులు ప్రకటించారు. ఈ డ్రగ్స్  సరఫరా కారణంగా వీరు 2018 లో కోట్ల రూపాయల సొమ్ము ఆర్జించి నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది భారత సంతతి వ్యక్తుల పేర్లను వెల్లడించారు. వీరి పేర్లు హరప్రీత్ సింగ్, నారాయణస్వామి, సెజియన్ ,బల్జిత్ సింగ్ ,దీపక్ గులాబ్, ముకుల్ , వికాస్ వర్మ, కాగా వీరందరూ పై గతంలో కూడా మనీ ల్యాండరింగ్  కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: