ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు తమ సంస్థకి చెందిన యాప్స్ లలో కానీ వెబ్సైట్లలో కానీ బగ్స్ ఉంటే వారిని కనుగొన్న వారికి భారీగా పారితోషకాలు ఇస్తూ ఉంటాయి.   ఈ క్రమంలోనే భారత్ కి చెందిన సైబర్ నిపుణుడు ఆనంద్ ప్రకాష్ అనే వ్యక్తి ఉబెర్ సంస్థలో బగ్ ఉన్నట్లుగా గుర్తించాడు. దాంతో అతడికి సదరు సంస్థ 6500 ల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో సుమారు 4 లక్షల 64 వేలు బహుమతిగా ఇచ్చింది.

 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపనీలు ఇప్పుడు ఇదే రకమైన వైఖరిని అవలభిస్తున్నాయి. తమ అప్లికేషన్లో ఉన్న లోపాలు కనుగొన్న వారికి భారీగా నజరానాలు ఇస్తున్నాయి. ఉబెర్ యాప్ లో బగ్ ఉందని అది ఎవరి ఖాతాని అయినా హ్యాక్ చేసే అవకాశం ఉందని హ్యాకర్స్ సులభంగా వీటిని హ్యాక్ చేయగలరని గుర్తించిన ఆనంద్ అందుకు తగ్గట్టుగా ఉబెర్ కి ఈ విషయాన్ని తెలిపాడు.

 

ఉబెర్ యాప్ లోని ఏపీఐ రిక్వెస్ట్ ఫంక్షన్ లో ఈ బగ్ ఉన్నట్లుగా ఆనంద్ కనిపెట్టాడు. దాంతో ఉబెర్ సెక్యూరిటీ అధికారులు వెంటనే ఆ తప్పుని సరిచేసుకున్నారు. దాంతో ఉబెర్ ఆనంద్ కి ఉబెర్ రివార్డ్ చెల్లించింది.ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 700 వందల మంది నిపుణులకి ఉబెర్ వారి పరిశోధనలకి గాను సుమారు 14 కోట్లు చెల్లించిందట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: