అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ఎలాగైనా సరే గద్దె దించాలని డెమోక్రాట్లు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే డెమోక్రాట్లు ట్రంప్ పై ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీగ దొరికింది ఇక డొంక కదలడమే ఆలస్యం అన్నట్టుగా, ట్రంప్ ప్రత్యర్ధి అయిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ కి నష్టం కలిగించేలా ట్రంప్ ప్రవర్తించారని అందుకు గాను విదేశీ శక్తుల మద్దతు అడిగారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

 

ఈ క్రమంలోనే ప్రతినిధుల సభ స్పీకర్ ట్రంప్ పై అధికారక విచారణ చేపట్టమని కీలక ఆదేశాలు జారీచేశారు. ప్రతినిధుల సభలో అధికారిక అభిశంసన తీర్మానం పెడుతున్నట్టుగా స్పీకర్ వెల్లడించారు. అధ్యక్షుడు అనే వ్యక్తి ప్రజలకి జవాబు దారీగా ఉండాలని చట్టానికి ఎవరూ అతీతులు కారని వెల్లడించారు.

 

ఇదిలాఉంటే జో బైడెన్ ని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడుతో మాట్లాడారని, అతని మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేశారని ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలోనే ట్రంప్ కూడా వివరణ ఇచ్చారు. నేను మాట్లాడిన మాట వాస్తవమే కాని బైడెన్ గురించి చర్చించలేదు అంటూ తెలిపారు. కాగా ప్రతినిధుల సభలో అత్యధిక బలం ఉన్న 235మంది డెమోక్రాట్లు మద్దతు ఇస్తున్నారు. దాంతో సర్వాత్రా స్పీకర్ ఇచ్చిన ఆదేశాలపై చర్చ తీవ్రంగా నడుస్తోంది. మరి ట్రంప్ ఉంటాడా ఊడిపోతాడో..


మరింత సమాచారం తెలుసుకోండి: