అమెరికాలో ఎన్నో తెలుగు సేవా సంస్థలు ఉన్నాయి. తెలుగు వారి గొప్పదనాన్ని చాటి చెప్పేలా, తెలుగు వెలుగులు అమెరికాలో సైతం ప్రసరించేలా , అక్కడ చేపట్టే కార్యక్రమాలు తెలుగువారందరూ  గర్వపడేలా ఉంటాయి. ఇప్పటి వరకూ అమెరికాలో ఉంటున్న తెలుగు వారికోసం ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి. అన్నీ లెక్కకి మించే ఉంటాయి. అయితే ఏ సంస్థ అయినా సరే స్థానికంగా తెలుగు సంస్కృతిని ప్రతిభింబించేలా

 

తెలుగు పండుగలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ పండుగలకి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాదు తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చినా సరే తక్షణ చర్యల చేపట్టి అండగా నిలుస్తారు. కానీ ఇప్పటి వరకూ అమెరికాలో తెలుగు మహిళల కోసం ప్రత్యేకంగా ఎటువంటి సంస్థ ఏర్పాటు చేయబడలేదు. దాంతో మొట్ట మొదటి సారిగా తెలుగు మహిళలు అందరూ కలిసి WETA ( women Empowerment Telugu association) ఏర్పాటు చేసుకున్నారు.

 

నిన్నటి రోజున అమెరికాలో ఘనంగా సినీనటి , ఎంపీ సుమలత చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించ బడింది. ఈ సంస్థని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఘానీ రెడ్డి సంస్థ చైర్మెన్ గా ఎన్నికయ్యారు. ఆమె మాట్లాడుతూ మహిళళ అభ్యున్నతికి ఎనలేని కృషి చేయడంలో WETA ఎప్పుడూ ముందుంటుందని ఆమె తెలిపారు. త్వరలో రాబోయే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని భారీ స్థాయిలో టెక్సాస్ లో నిర్వహించనున్నట్టుగా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: