అమెరికాలోనే అత్యంత కిరాతకుడైన సీరియల్ కిల్లర్‌‌గా శామ్యూల్‌ లిటిల్ వెలుగులోకి వచ్చాడు. మాజీ బాక్సర్ అయిన శామ్యూల్ అనేక మహిళలతో సెక్స్ చేసి అత్యంత కిరాతకంగా చంపినట్లు  పోలీసులు తెలిపారు. శామ్యూల్ ఇప్పటి దాక  93 మందిని ఆడవాళ్ల ప్రాణాలు తీసినట్లు గ్రహించారు. అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది వ్యభిచారిణులు, డ్రగ్స్‌కు అలవాటు పడిన మహిళలే ఉన్నారు అంటే నమ్మండి.


1980 దశకంలో ముగ్గురు మహిళలను హత్యచేసిన కేసులో శామ్యూల్‌కు 2014లో యావజ్జీవ కారాగార శిక్ష కూడా  పడింది. ప్రస్తుతం అతడు లాస్‌ఏంజెల్స్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అమెరికాలో రెండు దశాబ్దాలుగా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా పెండింగ్‌లో ఉన్న కేసులను దర్యాప్తు చేస్తున్న క్రమంలో జేమ్స్‌ హాలండ్‌ అనే పోలీసు అధికారి ఇటీవల శామ్యూల్‌ను ప్రశ్నించడంతో అతడి నేరాల చిట్టా మొత్తం బయటపడింది. 


తనకు పరిచయమైన ఆడవాళ్లకు చాలా తక్కువ సమయంలోనే ముగ్గులోకి దించి వారితో సెక్స్ చేయడంతో శామ్యూల్‌కు వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు తెలియచేసారు. చిల్లర దొంగతనాలు చేస్తూ జీవించే శామ్యూల్ లాస్‌ఏంజెల్స్, మియామీ, దక్షిణ కరోలినా, ఓహాయో, టెక్సాస్‌ సహా యూఎస్‌లోని 19 రాష్ట్రాల్లో మహిళలను హత్య చేశాడు. వారిని నగ్నంగా చేసి సెక్స్ చేసిన తర్వాత హత్య చేసి చెత్తకుప్పల్లో పడేసేవాడు 


అయితే తాను ఇప్పటివరకు ఎవరినీ రేప్ చేయలేదని, వారితో ఇష్టపూర్వకంగానే సెక్స్ చేశాడని అతడు చెప్పుకొని వస్తున్నాడు. తాను కన్నేసిన మహిళ ఎవరు, ఎలాంటిది అన్న ఆలోచన కూడా శామ్యూల్‌కి ఉండేది కాదు. సెక్స్ చేసి హత్య చేసిన వారిలో చాలామంది పేర్లు కూడా అతడికి తెలియదు అసలు. తనతో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొంటే మహిళలు విడిచిపెట్టరని, కొత్తవారితో శృంగారం చేసేటప్పుడు పాతవారు అడ్డుపడతారన్న ఆలోచనతోనే వారి ప్రాణాలు తీయడం అలవాటు చేసుకున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో తెలియచేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి: