ఫ్రాన్స్ కి చెందిన ఓ కుటుంభం తాము ఉంటున్న ఇల్లు పాడయింది కొత్త ఇల్లు తీసుకోవాలి కాబట్టి ఇది అమ్మేయాలని అనుకున్నారు. దాంతో పాటు ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు వేలానికి పెట్టాలని భావించారు. విలువైన వస్తువులు ఖరీదు కట్టే నిపుణులని పిలిచి లెక్కలు కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి చూపు వంటింట్లో ఎందుకు పనికి రాదు అన్నట్టుగా వేలాడదీసిన ఓ పైటింగ్ పై పడింది.

 

ఆ పెయింటింగ్  చూసిన ఓ నిపుణుడు షాక్ అయిపోయాడు. ఒక్క సారిగా పుస్తాకాలు తిరగేశాడు, హడావిడి పడ్డాడు, మంచి నీళ్ళు త్రాగుతూ ఇది మీకు ఎక్కడిది అంటూ ప్రశ్నించాడు. అసలేం జరుగుతుందో తెలియని వాళ్ళు ఇది మా పూర్వీకుల నుంచీ వస్తోంది అని చెప్పారు. అసలేమి జరిగిందని ఆత్రుతగా అడిగిన వారికి అతడు చెప్పిన సమాధానం విని కళ్ళు చెదిరిపోయాయి.

 

అది ఇప్పటి పెయింటింగ్   కాదు 13 శతాబ్దంలోనిది. దీనికోసం కొన్నేళ్లుగా ఎంతో మంది వెతుకుతున్నారు. ఎంతో అద్భుతమైన కళ ఇది అంటూ వివరించాడు. షిమాబుయే అనే ఇతాలియని చిత్రకారుడు వేసిన చిత్రమిది అత్యంత పురాతనమైనదని తెలిపాడు.అంతేకాదు దీని విలువ 47 కోట్లపై మాటే ఉంటుందని చెప్పడంతో వారు సంతోషానికి అవధులు లేవు. దాంతో త్వరలో ఈ పైటింగ్ లో వేలంలో పెట్టనున్నట్టుగా ఆ కుటుంభం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: