తమిళ సాహిత్య రంగంలో లింగ సమానత్వం లేదని, పురుష రచయితలకు లభించే గుర్తింపు మహిళా రచయితలకు ఇవ్వరని చెబుతుంటారు. కానీ, ట్రాన్స్ వుమన్, రచయిత ఎ.రేవతి అలాంటి చోటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కొలంబియా విశ్వవిద్యాలయ లైబ్రరీలో మాయ ఏంజెలో, టోనీ మోకి,న్, మార్మన్ సిల్కో, చేంజ్ పేర్ల సరసన ఆమె పేరును చేర్చారు.కొలంబియాలోని బట్లర్ లైబ్రరీ ముఖద్వారం వద్ద మంది అరిస్టాటిల్, ప్లేటో, హోమర్, డెమోస్టెనెస్, సిసిరోతో పాటు మొత్తంగా 8 మంది పురుష రచయితల పేర్లు ఉన్నాయి. మహిళా రచయితల పేర్లు కూడా చేర్చాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.


అయితే, 1989లో అక్కడి విద్యార్థులు పురుష రచయితల పేర్లకు పైన మహిళా రచయితల పేర్లను రాసి ప్రదర్శించారు. కానీ, కొద్ది రోజుల్లోనే యాజమాన్యం ఆ పేర్లను తొలగించింది.
దాదాపు 30 ఏళ్ల తరువాత, మహిళా హక్కుల నిరసన జ్ఞాపకార్థం, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన మహిళా రచయితల పేర్లతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శించారు. ఆ బ్యానర్‌లో తమిళనాడుకు చెందిన ట్రాన్స్ వుమన్, రచయిత ఎ.రేవతి పేరును కూడా చేర్చారు."రేవతి ఎవరని మీరు అడిగారు.

కానీ, నాలోని రేవతిని తెలుసుకోవడానికి, నేను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది" అని ఆమె చెప్పారు.తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో దురైసామిగా జన్మించిన రేవతి అయిదో తరగతి చదువుతున్నప్పుడు తనలోని లైంగిక పరమైన మార్పులను గమనించింది.స్కూల్‌లో చాలా మంది ఎగతాళి చేశారు. ఆటపట్టించారు. తల్లిదండ్రులు, సోదరుల నుంచి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.


చివరకు ఆమె తన కుటుంబాన్ని విడిచిపెట్టి దిల్లీ, ముంబయిలలో తిరిగింది. సమాజం ఆమెను చిన్నచూపు చూసింది. అనేక ఇబ్బందులకు గురి చేసింది. ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొనే అన్ని సమస్యలను ఆమె ఎదుర్కొన్నారు.2004లో రేవతి తన మొదటి పుస్తకం ''ఉనారువం ఉరువామ్'' రాశారు. భారతదేశంలో ట్రాన్స్ విమెన్ గురించి ట్రాన్స్ వుమన్ రాసిన తొలి పుస్తకం ఇది.


మరింత సమాచారం తెలుసుకోండి: