ప్రతీ బంధంలో చిన్న చిన్న గొడవలు సహజం... కానీ రక్త బంధం ఎప్పటికి వేడిపోదు. బ్రిటీష్‌ రాజవంశ సోదరులు ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్నా నేపథ్యంలో డ్యూక్‌ ఆఫ్‌ ససెక్స్‌ ప్రిన్స్‌ హ్యారీ స్పందించారు. ప్రస్తుతం.. భార్య మేఘన్‌ మార్కెల్‌తో కలిసి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నహ్యారీఈ క్షణం మేము కచ్చితంగా వేర్వేరు దారుల్లోనే ఉన్నాం. అయితే అత్యవసర సమయాల్లో మేము ఒకరికరం అండగా ఉంటామని చెప్పడం... అయన అన్నయ్యను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి నిదర్శనం.

ప్రతిరోజూ నేరుగా కలుసుకోలేకపోవచ్చు కానీ....ప్రేమ లేదనుకోవడం తప్పన్నారు. అన్నదమ్ముల మధ్య ప్రేమలు, చిన్న చిన్న గొడవలు వచ్చినంత మాత్రాన మా గురించి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు’ అని చెప్పుకొచ్చారు హ్యారీ. ఇక దక్షిణాఫ్రికా దేశాల పర్యటన గురించి చెబుతూ ఇది తన మనసుకు సాంత్వన చేకూరుస్తుందని అన్నారు. తన తల్లి ప్రిన్సెస్‌ డయానాను గుర్తు చేసుకునేందుకు.. ఆమె అడుగుజాడల్లో నడిచేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఇదే కాదు తన కుటుంబం పై గతంలో వచ్చిన పుకార్లను ఖండిస్తూ మరి కొన్ని విషయాలను పంచుకున్నారు.

ఒక రాజకుటుంబీకుడిగా తాను ప్రతీ క్షణం కెమెరా ముందే ఉంటున్నానని, ప్రతి క్షణం తన ఫొటోలు తీస్తున్నారని.. అయితే ఇదంతా తనను ఒక్కసారిగా గతంలోకి తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. కాగా హ్యారీ తల్లి 1997లో బ్రిటన్ యువరాణి డయానా ఫ్రాన్సులో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన విషయం ప్రపంచానికి తెలిసిందే. అయితే ఆ సమయంలో భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ... స్కాట్‌లాండ్‌లో వేసవి సెలవల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్‌లో ఉండడంపై సందేహాలు రేకెత్తాయి.

కారు ప్రమాదంలో డయానాతో పాటు సంపన్న వ్యాపారి కుమారుడు డోడీ అల్ ఫయేద్ కూడా ఉండడంతో మీడియా ఊహాలకు అంతేలేకుండా పోయింది. ఇరవైయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానాను తన ప్రియుడితో విహరిస్తున్న సమయంలో వారి అనుమతి లేకుండా ఫోటోలు తీసే ప్రయత్నంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైందంటూ వార్తలు షికార్లు చేసాయి. తన తల్లి జీవితంపై ఇలాంటివి దుష్ప్రభావం చూపాయని.. తన మరణాన్ని కూడా చెడుగా గుర్తుపెట్టుకునేలా చేశాయని విచారం వ్యక్తం చేశారు. ఆ గాయం తనను నేటికీ వెంటాడుతుందని.. తన జీవితంలో అతిపెద్ద విషాదం అని ఉద్వేగానికి గురయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: