Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 9:05 am IST

Menu &Sections

Search

పెద్ద పులి ఎక్కడికొచ్చిందో చూస్తే.. గుండె గుభేల్!

పెద్ద పులి ఎక్కడికొచ్చిందో చూస్తే.. గుండె గుభేల్!
పెద్ద పులి ఎక్కడికొచ్చిందో చూస్తే.. గుండె గుభేల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రజలంతా చేతికందిన సామానుతో చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోయారు. తలదాచుకునేందుకు ఏచిన్న గూడు దొరికినా చాలనుకుంటూ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వరదలకు మనుషులతో పాటు కాజీరంగా నేషనల్ జూలోని మూగజీవాలు కూడా నీడ కోల్పోయాయి. అలా వెళ్లిపోయిన జీవాల్లో ఓ పెద్దపులి ఉంది. పక్కనున్న గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి బెడ్ రూమ్ లో తల దాచుకుంది. ప్రస్తుతం ఈ వార్తనెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.


జూ ప్రాంతంలోని బగోరీ రేంజ్ లో హర్మోటి అనే గ్రామంలో జరిగిందీ ఉదంతం. నేషనల్ హైవే పక్కనున్న  మోతీలాల్‌ అనే వ్యక్తికి చెందిన పాత సామాను దుకాణంలోకి బెంగాల్ టైగర్ వచ్చి ఆ ఇంట్లోని గదిలోకి వెళ్లి తాపీగా మంచం మీద కూర్చుంది. అప్పటికే బయట నుంచి 'పులి పులి' అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఎదురుగా 20 అడుగుల దూరంలో బెంగాల్‌ టైగర్‌ ని చూసిన మోతీలాల్‌ మొద్దుబారిపోయి అక్కడే అలాగే నిల్చుండిపోయాడు. అయితే, బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్న ఆ పులి నెమ్మదిగా దుకాణం లోపలికి వెళ్లిపోయింది.


పులి లోపలికి వెళ్లిపోగానే..  గ్రామంలోని పశువైద్యుడు శాంశుల్‌ అలీ అటవీ శాఖ అధికారులకు వెంటనే ఈ విషయం చేరవేశాడు. దీంతో అక్కడికొచ్చిన అధికారులు బృందం.. కజిరంగా జాతీయ పార్కు భూభాగం 95శాతం నీట మునిగిందని, దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర వన్యప్రాణుల్లాగే పులి కూడా జనావాసాల్లోకి వచ్చిందని అంచనా వేశారు. పులికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి మళ్లీ పార్కులోకి తీసుకెళ్లి వదిలేయాలా? లేక తన దారిని అది పోయేదాకా వేచిఉందామా అని అధికారులు ఆలోచిస్తున్నారు.


 Where the Bengal Tiger takes rest .. heart gobel
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమ్ముడి కోసం రౌడీ స్టార్ ఆ రంగంలోకి వెళ్తాడా?
రజినీకాంత్ టు సూపర్ స్టార్.. 44 ఏళ్ల ప్రస్థానం
ఆ క్లాసిక్ పాటకు 30 ఏళ్లు.. రీమిక్స్ అదుర్స్
బిగ్ బాస్ లో హాస్యనటి ఆత్మహత్యాయత్నం!
బికినీ అందాల్లో రకుల్ ప్రీత్ సింగ్
'సైరా' కోసం 'సై' అంటున్న మళయాళ సూపర్ స్టార్..!
'సల్మాన్ ఖాన్ తో నా పెళ్లి' అంటూ బాంబు పేల్చిన నటి
వర్మ సినిమాలో ఛాన్స్ కావాలా.. అయితే అలా ఉండాల్సిందే!
కృష్ణా నీళ్ల కోసం కర్ణాటక కుయుక్తులు.. డేంజర్ లో ఏపీ!
ప్రధాని మోదీ కరెక్ట్ అంటున్న చిదంబరం
తెలుగు అభ్యర్థులకు ఐఏఎస్
మహానటికి మెగాస్టార్ ఆశీస్సులు
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ హవా బాగుందిగా
ప్రభాస్ 'సాహో' రిలీజ్ అయిపోయింది.. ఇలా!
ప్రకాశం బ్యారేజీకి రెండో ప్రమాద హెచ్చరిక
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
స్మృతి ఇరానీ తెలుగు ట్వీట్.. ఎందుకో!
బాలీవుడ్ మూవీ 'మిషన్ మంగళ్' కు హిట్ టాక్
చిరంజీవి స్థాయి ఏంటో చెప్పిన నాగార్జున
'రౌడీ బేబీ' యూట్యూబ్ లో రఫ్ఫాడిస్తోందిగా!
వర్మ ఈసారి కాంగ్రెస్ పై పడ్డాడు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.