అమరావతి శంకుస్థాపన కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి, అతిరధ మహారధుల కోసం ఎన్నో వినూత్న కార్యక్రామలతో పాటు వారికి విందు సత్కారాలూ అత్యంత గొప్పగా మొదలు అవబోతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ విషయం లో చంద్రబాబు తీరు మీద పవన్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ మద్దతు కోసం స్వయంగా ఆయన ఇంటికే వెళ్లి అభ్యర్ధించిన చంద్రబాబు పవన్ ని ఒప్పించిన సంగతి తెలిసిందే.

 

పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు స్వయంగా కలిసి ఆహ్వానం


 అప్పుడు బాబు కి పవన్ ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ - టీడీపీ కూటమి కోసం చాలా కష్టపడ్డాడు. ఎన్నికల సమయం లో ఒక క్షణం కూడా తీరిక లేకుండా పవన్ పనిచేయడం , ఎలాంటి ఫలితాన్నీ కూడా ఆశించకుండా జనాలకి మేలు చెయ్యండి చాలు అని కోరుకోవడo పవన్ కే చెల్లింది. అలాంటి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు స్వయంగా కలిసి ఆహ్వానం ఇవ్వాల్సిన కనీస బాధ్యతా సంస్కారం ఉంది , దానికి భిన్నంగా చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి ఆహ్వానించడం మానేసి చివరికి కెసిఆర్ ఇంటికి కూడా వెళ్ళడానికి సిద్దం అవుతున్నారు.


రాజధాని శంకుస్థాపన కి ఎన్నో రోజులు లేకపోవడం తో పవన్ ని గౌరవప్రధంగా బాబు ఇంకెప్పుడు ఆహ్వానిస్తారు? కానీ బాబు ఇంకా ఈ విషయం మీద ఎలాంటి స్పందనా తెలపలేదు. మీడియా కూడా కావాలనే ఈ విషయం మీద బాబు ని ఒక్క ప్రశ్న కూడా అడగట్లేదు. నెమ్మదిగా పవన్ ని ఇగ్నోర్ చెయ్యడం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రచిస్తున్నారు అని ఫాన్స్ కోపంగా ఉన్నారు.


పనుల ఒత్తడి కారణంగా పవన్ ను ఆహ్వానించటానికి వెళ్లని బాబు.. తన తరఫు ప్రతినిధులుగా మంత్రులు కామినేని శ్రీనివాస్.. అయ్యన్న పాత్రుడులను పంపుతున్నారు. ఎన్నికల సమయం లో ఇల్లు వెత్తుక్కుంటూ వెళ్ళేంత తీరిక ఉన్న మనిషికి ముఖ్య మంత్రి హోదా రాగానే శంకుస్థాపన కి ఆహ్వానం పంపడం కోసం మాత్రం వెళ్ళే తీరిక లేదా అంటూ పవన్ అభిమానులు చంద్రబాబు మీద చాలా గుర్రుగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: