అంతర్జాతీయ స్థాయి మాఫియా డాన్‌ ఎక్కడో విదేశాలలో ఉండి భారతదేశంలో నేరమయ కార్యకలాపాలను నడిపిస్తూ ఉండడం, ఇక్కడ ముంబాయి వంటి నగరాల్లోని పెద్దపెద్ద వ్యాపారులు.. ఆ డాన్‌ తరఫు మనుషులు ఇచ్చే సూచనల ప్రకారం.. తాము నడుచుకుంటూ ఉండడం... వారు అడిగినంత మొత్తాలు సమర్పించుకుంటూ ఉండడం.. సదరు డాన్‌?. ప్ల్లాంట్‌ చేసిన మనుషులు పోలీసు శాఖలో కీలక పదవుల్లో ఉండి.. డాన్‌ కార్యకలాపాలుసజావుగా జరిగేలా.. పోలీసు ప్రయత్నాలు అతనికి ముందే తెలిసిపోయేలాగా సహకరిస్తూ ఉండడం.. ఇలాంటి వన్నీ కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటాయని అనుకుంటున్నారా? అక్కర్లేదు. వాస్తవజీవితంలో ఉండే పరిస్థితి కూడా అంతే. సాధారణంగా డాన్‌ల జీవితం గురించి లోతుగా మనకు తెలిసే అవకాశం లేదు గనుక.. మనం ఊహించుకుంటూ, సినిమాలు చూసి 'అవునా' అనుకుంటూ బతుకుతాం. కానీ ఇవాళ చోటా రాజన్‌ ఇండోనేషియా రాజధాని బాలిలో వెల్లడించిన వివరాలు చూస్తోంటే పైన చెప్పుకున్నవన్నీ నిజమే అనిపిస్తోంది. 


పోలీసులకు చేజిక్కిన చోటా రాజన్‌ ఇప్పటికీ దావూద్‌ అంటే నాకు భయంలేదనే చెబుతున్నాడు. కానీ ముంబాయి పోలీసుల మీద మాత్రం అపనమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ముంబాయి పోలీసులు దావూద్‌ మనుషులు ప్లాంట్‌ అయి ఉన్నారని చోటా రాజన్‌ చెబుతున్నాడు. తనను ముంబాయి పోలీసులకు అప్పగించకుండా ఢిల్లీ తీసుకువెళ్లాలని కోరుతున్నాడు. ఢిల్లీలో అయితే ప్రభుత్వం ఏ జైల్లో ఉండమంటే ఆ జైల్లో ఉంటానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 


ముంబాయి పోలీసులు దావూద్‌ మనుషులు ఉన్నారని, వారు తనను గతంలో కూడా దారుణంగా హింసించారని రాజన్‌ అంటున్నాడు. ముంబాయి పోలీసులు తనకు అన్యాయం చేశారని, వారి మీద తనకు నమ్మకం లేదని చెబుతున్నాడు. ఈ అంతర్జాతీయ నేరస్తుడు చెప్పాడని కాదు గానీ.. ముంబాయి పోలీసుల్లో కొందరు దావూద్‌కు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఇదివరలోనే వచ్చాయి. మరి రాజన్‌ విజ్ఞప్తిని భారత్‌ మన్నిస్తుందో లేదో?


మరింత సమాచారం తెలుసుకోండి: