రాజకీయనాయకులకి చెప్పిందే చెప్పడం పెద్ద వింతేమీ కాదు కానీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు వెంకయ్య నాయుడు మాత్రం అరగదీసిన క్యాసెట్ మళ్ళీ మళ్ళీ అరగదీస్తూ ఉంటారు. తాను ప్రధానమంత్రి కి వీర విదేయుడిని అని ఆయన చాటుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఆ విషయం ఇవాళ మీడియా తో చెప్పుకొచ్చారు .

 

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం లో మరొక్క మారు ఈ విషయం స్పష్టం చేసారు. ఈ సమావేశం లో మోడీ తో పాటు పార్టీ కి చెందిన పెద్ద నేతలు అందరూ పాల్గొన్నారు బీజేపీ ఎంపీలు సైతం హాజరు అయిన ఈ సమావేశం పూర్తిగా బీహార్ ఫలితాల విషయం మీదనే డిస్కషన్ సాగింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. బీహార్ బీజేపీ ఓడిపోవడం వెనక చాలా సీరియస్ చర్చ సాగింది. ఇందులో మోడీ కి గట్టి సపోర్ట్ గా వెంకయ్య నిలిచారు, బీహార్ ఓటమి కి మోడీ ని బాధ్యుడిని చెయ్యడానికి ఆయన బద్ధ వ్యతిరేకం అని చెప్పకనే చెప్పారు. తరవాత మీడియాతో మాట్లాడుతూ అదే రకమైన సందేశం అందించారు.


లోకల్ గా బీజేపీ కార్యకర్తల పనీ, లోకల్ నాయకుల పనీ సరిగా లేకపోవడం వల్లనే ఈ ఓటమికి నాంది పడింది అన్నట్టు చెప్పుకొచ్చారు వెంకయ్య. మీడియా తో కూడా ఈ విషయం మీద బీజేపీ తరఫున పెద్ద తలకాయ లాగా పాల్గొన్న వెంకయ్య బీహార్ తీర్పు ని సరైన విధంగా అర్ధం చేసుకోవాల్సి ఉంది అని, పార్లమెంట్ ని స్తంభింపచేయడం కోసం ఈ తీర్పు ని ఉపయోగించుకుంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు అని ఆయన తెలిపారు.  అలా చేస్తే బీహార్ ప్రజల వివేకాన్ని - విజ్ణతను ప్రశ్నించడమే అవుతుందని వెంకయ్యనాయుడు సెలవిచ్చారు.


ఈ నెల  ఇరవై ఆరు నుంచీ డిసెంబర్ ఇరవై మూడు వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశం లో ప్రభుత్వం కీలక బిల్లులు ప్రవేశపెట్టడానికి చూస్తూ ఉండగా ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. బీహార్ లో లో మోడీ సేన చిత్తు అయిన కేవలం పది రోజుల తరవాత జరగబోతున్న ఈ సమావేశాలని ప్రతిపక్షాలు చాలా తెలివిగా ఎదురుకొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: