తెలంగాణ సీఎం కేసీఆర్ పోల్ మేనేజ్ మెంట్ లో ఇటీవల అద్భుతమైన ప్రజ్ఞ చూపుతున్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో ప్రతికూలతలు ఎన్ని ఎదురైనా బంపర్ మెజారిటీ సాధించారు. అది కూడా అలాంటిలాంటి మెజారిటీ కాదు.. టీఆర్ఎస్ క్యేడర్ కూడా ఆశ్చర్యపోయేలా రికార్డు మెజారిటీ సాధించారు. ఇంతటి విజయం వెనుక కేసీఆర్ స్కెచ్, ప్లాన్ ఉన్నాయని తెలుస్తోంది. 

ఇప్పుడు వరంగల్ ఉపఎన్నికల ఇచ్చి జోష్ తో జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారు. వరంగల్ అంటే టీఆర్ఎస్ కు పట్టు ఉన్న ప్రాంతమే.. అందులోనూ కరడుగట్టిన తెలంగాణ జిల్లా. కానీ జీహెచ్ ఎంసీ సంగతి అలా కాదు. ఇక్కడ సెటిలర్ల పాత్ర చాలా ఉంటుంది. వాళ్లను ఆకట్టుకోకుండా ఇక్కడ గెలుపు అంత సులభం కాదు. అందులోనూ ఇక్కడ టీడీపీ బలంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ జీహెచ్ఎంసీ పరిధిలోని కీలక నియోజకవర్గాలు గెలుచుకోగలిగింది. జూబ్లీహిల్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరేసింది. మరి అలాంటి చోట గెలవాలంటే గట్టి స్కెచ్చే ఉండాలి. ఇలాంటి చోట టీడీపీ తరపున చంద్రబాబు వంటి నేతలు ప్రచారం చేస్తే టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు. 

అందుకే చంద్రబాబును హైదరాబాద్ లో ప్రచారం చేయనీయకుండా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారంటూ ఓ ఆంగ్ల పత్రిక అనాలసిస్ రాసింది. చంద్రబాబు హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి దిగితే..ఓటు కు నోటు మళ్లీ తెరపైకి వస్తుందని చెప్పేందుకే.. రేవంత్, సండ్రల వాయిస్ ధ్రువీకరణ జరిగిందని విశ్లేషించింది. వాస్తవానికి ఓటుకు నోటు కేసు తర్వాతే చంద్రబాబు విజయవాడ బాట పట్టారు. దాదాపు 3 నెలల తర్వాత హైదరాబాద్ లోని సెక్రటేరియల్ లోకి అడుగు పెట్టారు. మరి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాబు పాత్ర ఎలా ఉంటుంది.. టీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ కు లొంగుతారా.. వెయిట్ అండ్ సీ. 



మరింత సమాచారం తెలుసుకోండి: