రాజకీయాల్లో ప్రత్యర్థులు, శత్రువులు సహజం. కానీ చాలాసార్లు ఎవరు ఎవరికి ప్రత్యర్థో చెప్పడం అంత సులభం కాదు. పార్టీలు ప్రత్యర్థులుగా ఉంటాయి తప్ప.. వ్యక్తులు ప్రత్యర్థులుగా నిర్దిష్టంగా ఉండటం తక్కువ మంది విషయంలోనే జరుగుతుంది. జగన్ కు చంద్రబాబు ప్రత్యర్థి. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఎంత వైరం ఉందో తెలియదు కానీ.. ఇధ్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య మాత్రం శత్రుత్వం నెలకొంది.

వారిద్దరే వైసీపీ ఎమ్మెల్యే రోజా.. టీడీపీ ఎమ్మెల్యే అనిత. గత అసెంబ్లీ సమావేశాల సమయం నుంచే వీరిద్దరి మధ్య వ్యక్తిగత శత్రుత్వం మొదలైంది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో రోజాను సస్పెండ్ చేయాలని అనితే ప్రతిపాదించింది. అప్పటి నుంచి రోజా ఇష్యూను డీల్ చేసేందుకు టీడీపీ అనితను ప్రయోగిస్తోంది. అనిత దళిత ఎమ్మెల్యే కావడాన్ని టీడీపీ అడ్వాంటేజీగా తీసుకుంటుందన్న వాదన కూడా ఉంది. 

మొన్నటి రోజా అసెంబ్లీలో తిట్టిన అంశంపై అసెంబ్లీలోనే అనిత కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియా పాయింటుకొచ్చిన అనిత ఇదే అంశంపై రోజాకు సవాల్ విసిరింది. వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేయడం సరికాదన్న అనిత.. రోజాకు దమ్ముంటే సబ్జట్ పై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరింది. ఏ విషయంపైనైనా రోజాతో డిబేట్ కు సిద్దమని ప్రకటించింది. 

ఐతే.. అనిత సవాల్ కు రోజా స్పందిస్తుందా అన్నది ప్రశ్న. ఒక వేళ స్పందిస్తే మాత్రం ఈ మాటల యుద్ధం ఆసక్తికరంగానే ఉంటుంది. ఊరికే తిట్టుకోవడం ద్వారా కాకుండా అర్థవంతమైన డిస్కషన్ ద్వారా ఎవరికెంత సత్తా ఉందో తేలిపోతుంది. ఇప్పుడు బంతి రోజా కోర్టులోనే ఉంది. మరి రోజా ఏంచేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: