తెలంగాణా ఏర్పడిన దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకూ తెలంగాణా వైపు చూడను కూడా చూడలేదు. తెలంగాణా గడ్డ మీద ఆయన కాలు మొపనే లేదు. ఇది యావత్ తెలంగాణా ప్రజానీకాన్నీ తొలిచేస్తున్న అంశం. జనాలతో పాటు ఆ రాష్ట్ర తెలంగాణా ఐటి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె.టి.ఆర్. ప్రధాన ఆరోపణ కూడా ఇదే.

 

 

 

 తెలంగాణా రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది అనేది మాగ్జిమం తెరాస నేతల ఆరోపణ. ఈ రెండు ఆరోపణలకీ సమాధానం చెబుతూ వచ్చేనెల మొదటి వారంలో నరెంద్రమోదీ రామగుండంలోని ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన కోసం రాబోతున్నారు అని బీజేపీ నేతల నుంచి అందుతున్న సమాచారం. అది అయ్యాక రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించడం కోసం తలపెట్టిన నాలుగు వేల మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి.

 

 

 

ఈ రకంగా ప్రధాని అయిన తరవాత తొలిసారిగా నరేంద్ర మోడీ తెలంగాణా లో పర్యటిస్తారు. మిగిలిన అన్ని రాష్ట్రాల లాగానే , ముఖ్యంగా ఏపీ తో సమానంగా నే తాను తెలంగాణా విషయంలో కూడా ప్రవర్తిస్తున్నాను అని చెప్పుకోవడం కోసమైనా మోడీ ఈ యాత్ర చెయ్యల్సో ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం లో బీజేపీ ని ఇరుకున పెట్టడం కోసం తెరాస 'మోడీ - తెలంగాణా రాక' అంశాన్ని బాగా వాడుకుంటోంది. సో ఈ టూర్ తో మోడీ రాక ని అడ్డం పెట్టుకుని  తెరాస చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి ఇది బీజేపీకి చాలా ఉపయోగపడుతుంది. ఎన్నికలకంటే ముందే ఈ కార్యక్రమం జరిగితే ఇంకా మంచిది, కానీ మోడీ షెడ్యూల్ ప్రకారం సాధ్యంకాదు అంటున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: