ఏ ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నామన్నది కాదు.. అందులో మనకెంత తృప్తి ఉందన్నది ముఖ్యం.. ఎవరో ఏదో అనుకుంటారని మనకు నచ్చిన పని చేయడం మానుకోవద్దు. మనకో మనస్సనేది ఉంటుంది. అది కొన్ని పనులు చేయమని చెబుతుంది. దాని మాట అప్పుడప్పుడు వినాలి. అప్పుడే మనలోని అసలు మనిషి మేల్కొంటాడు. మన జీవితాన్నిసార్థకం చేస్తాడు. 

ఈ కలెక్టర్ అదే చేశాడు.. ఆయన కలెక్టర్ కాకముందే ఓ డాక్టర్ కూడా.. డాక్టర్‌గా లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశముంది. కానీ వదులుకున్నాడు.. ఆ తర్వాత కష్టపడి ఐఏఎస్‌ అయ్యాడు. అసిస్టెంట్ కలెక్ట్రర్ గా ఉద్యోగంలో చేరాడు.. అధికారాలను చలాయించే అవకాశం పుష్కలంగా ఉంది. కోట్ల మంది విద్యార్థులు కలలు కనే ఉద్యోగమని కానీ.. దాన్ని తృణ ప్రాయంగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఇంతకీ ఎవరాయన అంటారా.. ఆయన పేరు రోమన్ సైనీ. వయస్సు కేవలం 24 ఏళ్లు.. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నాడు. 16ఏండ్లకే మెడికల్ ఎంట్రన్స్‌లో సంచలనం రేపాడు. డాక్టర్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నడాు. కేవలం 22 ఏళ్లకే సివిల్ సర్వీస్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యాడు. మరి ఇన్ని సాధించి ఆ ఉద్యోగం ఎందుకు వదలుకున్నాడు.

ఎందుకంటే కోట్లాది మంది విద్యార్థులకు విద్య అందించే ఓ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించమని అతని మనుసు చెబుతోంది. తన ఫ్రెండ్ గౌరవ్ ముంజల్ ఏర్పాటు చేసిన అన్‌ అకాడమీ అనే యూట్యూబ్ చానెల్లో పాఠాలు చెప్పడం కోసం ఈ పోస్టు వదిలేయాలని డిసైడయ్యాడు. ఆయన ఇప్పటికే రెండేళ్లుగా నెట్లో పాఠాలు చెబుతున్నారు. మంచి స్పందన వస్తోంది.  కానీ ఉద్యోగ రీత్యా పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు. అందుకే కలెక్టర్ పోస్టుకు గుడ్ బై చెప్పబోతున్నాడు.

మీకు ఎన్నో ఆలోచనలున్నాయా.. వాటిని నెరవేర్చుకోమని మనసు చెబుతున్నా.. నచ్చని ఉద్యోగంతోనే నెట్టుకొస్తున్నారా..అయితే ఒక్కసారి ఆలోచించండి. ధైర్యంతో ముందడుగేయండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: