ప్రపంచంలో ఉగ్రవాదుల దుశ్చర్యలు  రోజు రోజుకి పెచ్చుమీరిపోతున్నాయి. మొన్నటికి మొన్న కొత్త సంవత్సరం రోజునే ఉగ్రవాదులు భారత్ లో పటాన్ కోఠ్ పై దాడిచేశారు. తాజాగా ఆఫ్గనిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. జలాలాబాద్‌లోని భారత ఎంబసీకి 200మీటర్ల దూరంలో ఈ పేలుడు జరిగింది. ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు. విదేశీ ఎంబసీలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.

రెండు ఘటనల్లో ముగ్గురు ఆప్గన్ పోలీసులు దుర్మరణం పాలయ్యారు. భారత్ ఎంబసీ జలాలాబాద్ లో ఉండగా, పాక్ ఎంబసీ నంగార్హర్ నగరంలో ఉంది. ఏకకాలంలో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించడంతో అధికార వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ప్రస్తుతం రెండు చోట్లా ఉగ్రవాదులతో ఆఫ్గన్ పోలీసులు తలపడుతున్నారు.భారతీయులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

బాంబు దాడి జరిగిన ప్రదేశం


పేలుడు ప్రాంతంలో అనేక దేశాల ఎంబసీలు ఉన్నాయని, భారత ఎంబసీ మాత్రమే ఉగ్రవాదుల లక్ష్యం కాదని అధికారులు పేర్కొన్నారు.గత పదిరోజల్లో ఇండియన్ ఎంబసీ ముందు ఇది మూడో బాంబుపేలుడు. జనవరి 3, జనవరి 8న బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ బాంబు పేలుళ్ల వెను పాక్ ఆర్మీ అధికారులు ఉన్నట్టు ఇటీవలే ఆఫ్గాన్ అధికారులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: